Prabhas : ప్రభాస్‌కు అయోధ్య ప్రతిష్ఠాపన ఆహ్వానం
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:59 AM
‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన దక్షిణాది పాన్ ఇండియా స్టార్ ప్రభా్‌సతో పాటు కన్నడ నటుడు యశ్‌కు వచ్చే నెల 22న అయోధ్యలో నిర్వహించే
యశ్, రణ్‌బీర్-ఆలియా, అజయ్ దేవగన్‌కు కూడా..
ముంబై, డిసెంబరు 25: ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించిన దక్షిణాది పాన్ ఇండియా స్టార్ ప్రభా్‌సతో పాటు కన్నడ నటుడు యశ్‌కు వచ్చే నెల 22న అయోధ్యలో నిర్వహించే రామమందిర ప్రతిష్ఠాపన వేడుకకు ఆహ్వానం అందింది. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. బాలీవుడ్ నటులు రణ్‌బీర్‌కపూర్-ఆలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ డియోల్, టైగర్ ష్రాప్, ఆయుష్మాన్ ఖురానా కూడా అతిథుల జాబితాలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్‌లాల్, సంజయ్ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుశ్, రిషభ్ శెట్టిని కూడా ఇప్పటికే వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.