Amit Shah: పేరు మార్చుకున్నా ఫలితం ఉండదు
ABN , First Publish Date - 2023-07-29T01:07:12+05:30 IST
ప్రతిపక్ష కూటమి ఇండియా అని పేరు మార్చుకున్నంత మాత్రాన ఫలితాల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు.

చెన్నై, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష కూటమి ఇండియా అని పేరు మార్చుకున్నంత మాత్రాన ఫలితాల్లో ఎలాంటి మార్పూ ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న విపక్ష నేతలంతా తమ వారసులకు పట్టం కట్టేందుకే తహతహలాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన ఎన్ మన్-ఎన్ మక్కల్ (నా భూమి-నాప్రజలు) పాదయాత్రను అమిత్ షా శుక్రవారం రామేశ్వరంలో ప్రారంభించారు. సోనియా తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయాలని, స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని సీఎం చేయాలని.. లాలూ తన పుత్రుడు తేజస్విని సీఎం చేయాలని, బెంగాల్ సీఎం మమత తన మేనల్లుడిని సీఎం చేయాలని ఆకాంక్షిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.