Land for jobs Case : సీబీఐ కేసులో లాలూ, రబ్రీ, మీసా పిటిషన్లపై ఢిల్లీ కోర్టు సంచలన ఆదేశాలు
ABN , First Publish Date - 2023-03-15T12:55:31+05:30 IST
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), రబ్రీ దేవి (Rabri Devi), వారి కుమార్తె మీసా భారతి
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), రబ్రీ దేవి (Rabri Devi), వారి కుమార్తె మీసా భారతి (Misa Bharathi)లకు బుధవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. రైల్వే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్యోగార్థుల భూములను రాయించుకున్నారని ఆరోపిస్తూ సీబీఐ దాఖలు చేసిన కేసులో వారికి ఈ ఊరట లభించింది. వారితోపాటు ఈ కేసులో ఇతర నిందితులకు కూడా కోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది.
వీరందరికీ రెగ్యులర్ బెయిలు మంజూరు చేసిన స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ ఇచ్చిన ఆదేశాల్లో, సీబీఐ (CBI) వీరిని అరెస్ట్ చేయలేదని, ఎటువంటి అరెస్టులు లేకుండానే ఛార్జిషీటు దాఖలు చేశారని పేర్కొన్నారు. నిందితులంతా రూ.50,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, అంతే మొత్తానికి జామీనును సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 29న జరుగుతుందని తెలిపారు.
లాలూ 2004-2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ - CBI) పేర్కొంది. నియామకాల కోసం భారతీయ రైల్వేలు అనుసరించే విధానాలను, ప్రక్రియలను ఉల్లంఘించి, ఈ నియామకాలు జరిగినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో తెలిపింది. ఉద్యోగార్థులు స్వయంగా తాము కానీ, తమ కుటుంబ సభ్యుల ద్వారా కానీ లాలూ కుటుంబ సభ్యులకు తమ భూములను ఇచ్చారని తెలిపింది. అమ్మిన సందర్భాల్లో మార్కెట్ విలువలో ఐదో వంతుకు అమ్మారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
Minister: ఆ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం
Land for jobs Case : కోర్టుకు హాజరైన లాలూ దంపతులు