Film actress: తనకు ఏడుసార్లు గర్భస్రావం చేయించారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో నటి విజయలక్ష్మికి వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2023-09-08T08:29:11+05:30 IST

‘నామ్‌ తమిళర్‌ కట్చి’ కన్వీనర్‌, సినీ దర్శకుడు సీమాన్‌ తనకు ఏడుసార్లు గర్భస్రావం చేయించారంటూ సినీ నటి విజయలక్ష్మి(Film actress Vijayalakshmi)

Film actress: తనకు ఏడుసార్లు గర్భస్రావం చేయించారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో నటి విజయలక్ష్మికి వైద్య పరీక్షలు

అడయార్‌(చెన్నై): ‘నామ్‌ తమిళర్‌ కట్చి’ కన్వీనర్‌, సినీ దర్శకుడు సీమాన్‌ తనకు ఏడుసార్లు గర్భస్రావం చేయించారంటూ సినీ నటి విజయలక్ష్మి(Film actress Vijayalakshmi) ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఆమెకు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయంపై పోలీసులు ఆమెను విచారించిన నేపథ్యంలో మరికొన్ని సంచలన విషయాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తిరువళ్ళూరు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరైన విజయలక్ష్మి న్యాయమూర్తికి వాంగ్మూలం ఇచ్చారు. దానిని ఆధారంగా చేసుకుని సీమాన్‌పై పోలీసులు తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదేసమయంలో విజయలక్ష్మికి పోలీసులు గురువారం కీల్పాక్కంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. దానికి సంబంధించి వైద్యులు ఇచ్చే నివేదిక ఆధారంగా సీమాన్‌పై చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఐదు రోజుల క్రితం సీమాన్‌ మదురైలో ఉండగా, ఆయన కోసం ఐదు ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్ళాయి. అదేసమయంలో సీమాన్‌ అఙ్ఞాతంలోకి వెళ్ళారంటూ ప్రచారం జరిగింది. అయితే, పోలీసులు మాత్రం సీమాన్‌కు సమన్లు ఇచ్చేందుకు మాత్రమే వెళ్ళామని వివరణ ఇచ్చారు. కాగా, సీమాన్‌ తనను పెళ్ళి చేసుకుంటానని మోసగించారని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ విజయలక్ష్మి గత 12 యేళ్ళుగా కోరుతున్న విషయం తెల్సిందే. గతంలో ఒకసారి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తగిన విధంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆమె మళ్ళీ చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

nani3.jpg

Updated Date - 2023-09-08T08:29:12+05:30 IST