ఉపేంద్ర పార్టీకి ఈసీ ఏ గుర్తు కేటాయించిందో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-02-25T12:33:38+05:30 IST
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ నటుడు ఉపేంద్ర(Upendra)కు చెందిన ఉత్తమ ప్రజాకీయ పా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ నటుడు ఉపేంద్ర(Upendra)కు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో చిహ్నం కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్(Election Commission) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపేంద్ర ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 2023 శాసనసభ ఎన్నికల కోసం ఆటో రిక్షా గుర్తు లభించిందని, అందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు. ఉపేంద్ర గతంలోనే ఉత్తమ ప్రజాకీయపార్టీ పేరిట రాష్ట్రమంతటా పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పార్టీతో పోటీ చేశారు. అయితే అప్పట్లో గుర్తు ఖరారు కాలేదు. 2018 నుంచే ప్రత్యేక సిద్ధాంతాలతో రాజకీయ పార్టీని కొనసాగిస్తున్నారు. అభ్యర్థిగా పోటీ చేయదలచుకున్నవారు నియోజకవర్గ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించేలాంటి వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఆటో డ్రైవర్లంటే ఎనలేని అభిమానం చూపిన దివంగత నటుడు శంకర్‌నాగ్‌కు ఆటో రిక్షా గుర్తును అంకితం చేస్తానన్నారు.