MLA: టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్యేతో సిబ్బంది వాగ్వాదం
ABN , First Publish Date - 2023-06-07T13:05:22+05:30 IST
బెంగళూరు - మైసూరు(Bangalore - Mysore) ఎక్స్‌ప్రెస్ హైవే రామనగర టోల్ వద్ద మళవళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేంద్రస్వామి(Congress MLA Narend

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు - మైసూరు(Bangalore - Mysore) ఎక్స్‌ప్రెస్ హైవే రామనగర టోల్ వద్ద మళవళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేంద్రస్వామి(Congress MLA Narendra Swamy)పై సిబ్బంది విరుచుకుపడ్డారు. బెంగళూరు నుంచి మళవళ్ళికి వెళ్తుండగా ఎమ్మెల్యే పాస్(MLA pass) ఉన్న కుంబళగోడ కణమినకి టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి చెక్ చేశారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే, టోల్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసులు వస్తే తెలుస్తుందని హెచ్చరించారు. అంతలోనే సిబ్బంది సైతం ఏ పోలీసులో రానివ్వండి అంటూ... రెచ్చి పోవడమే కాకుండా మిమ్మల్ని హైవేపై ఉచితంగా వదు లుతున్నామని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకోగా మంగళవారం వైరల్ అయ్యింది.
