Terror conspiracy case: ఉగ్రవాద కుట్ర కేసులో ఎన్ఐఏ దాడులు
ABN , First Publish Date - 2023-05-27T12:31:52+05:30 IST
ఉగ్రవాద కుట్ర కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ ప్రాంతంలో శనివారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది. జబల్‌పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు....
జబల్‌పూర్ (మధ్యప్రదేశ్): ఉగ్రవాద కుట్ర కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ ప్రాంతంలో శనివారం నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది. జబల్‌పూర్ లోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరుపుతున్నారు.(Terror conspiracy case) భోపాల్ ఉగ్రవాద కుట్ర కేసులో బంగ్లాదేశ్ కు చెందిన జమాత్ ఉల్ ముజాహిదీన్ నిధులు సమకూర్చిందనే సమాచారంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు.( NIA raids) ఉగ్రవాద కుట్ర కేసులో జబల్‌పూర్(Jabalpur) ప్రాంతంలోని అనుమానితుల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.ఈ కేసులో ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ సోదాలు చేసింది. ఈ ఉగ్రవాద కుట్ర కేసులో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10మందిని, బంగ్లాదేశ్ కు చెందిన మరో ఆరుగురిని ఇప్పటికే అరెస్టు చేసి, భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టింది.
బంగ్లాదేశీయులు ఎలాంటి పత్రాలు లేకుండా భారత ఫోర్జరీ డాక్యుమెంట్లతో భారతదేశంలోకి చొరబడ్డారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఎన్ఐఏ సోదాల్లో పలు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్ లు, గుర్తింపు కార్డులు దొరికాయి. ఈ డాక్యుమెంట్లతో ఉగ్రవాద కార్యకలాపాల కోసం డబ్బు బదిలీ చేశారని తేలింది. జిహాది సాహిత్యం, వీడియోలు, నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జేఎంబీ, అల్ ఖైదా, తాలిబన్ ల ప్రకటనల కాపీలు లభించాయి.