UPI Transactions : డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలా? క్లారిటీ ఇచ్చిన NPCI
ABN , First Publish Date - 2023-03-29T15:35:37+05:30 IST
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఇకపై ఉచితం కాదని, ఆన్‌లైన్ లావాదేవీలకు రుసుము చెల్లించవలసి ఉంటుందని కొందరు
న్యూఢిల్లీ : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు ఇకపై ఉచితం కాదని, ఆన్‌లైన్ లావాదేవీలకు రుసుము చెల్లించవలసి ఉంటుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం, తప్పుదోవ పట్టించే సమాచారం అని స్పష్టమవుతోంది. యూపీఐని అభివృద్ధి చేసి, నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వివరాలను తెలిపింది.
యూపీఐ లావాదేవీలను నిర్వహించే కస్టమర్లు ఎటువంటి రుసుమును చెల్లించవలసిన అవసరం ఉండదని ఎన్‌పీసీఐ తెలిపింది. నిబంధనల ప్రకారం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు ప్రీపెయిడ్ పేమెంట్ ఇస్ట్రుమెంట్స్ (PPI)లకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. వాలెట్లు, క్రెడిట్ కార్డులు వంటి పీపీఐల ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఇంటర్‌ఛేంజ్ ఫీ 1.1 శాతం చెల్లించవలసి ఉంటుందని తెలిపింది.
సాధారణ యూపీఐ పేమెంట్లు, అంటే, బ్యాంకు ఖాతా నుంచి బ్యాంకు ఖాతాకు జరిపే యూపీఐ చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలను చెల్లించవలసిన అవసరం లేదని తెలిపింది. యూపీఐ ఎనేబుల్డ్ యాప్స్‌లో ఏదైనా బ్యాంకు ఖాతాను, రూపే క్రెడిట్ కార్డును లేదా ప్రీపెయిడ్ వాలెట్‌ను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.
యూపీఐని పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చునని, కార్యకలాపాలు వేగంగా జరుగుతాయని, ఇది సురక్షితమైనదని, ఆటంకాలు లేనిదని ఎన్‌పీసీఐ చెప్పింది. ప్రతి నెలా 800 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. కస్టమర్లు, మర్చంట్లు ఈ లావాదేవీలను ఉచితంగానే నిర్వహిస్తున్నారని వివరించింది.
ఇవి కూడా చదవండి :
Karnataka Assembly Elections: 80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటింగ్
DK Shivakumar: మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. డీకే రియాక్షన్