Raghav Chadha-Parineeti Chopra: రాజకీయ నేతను పెళ్లి చేసుకోనంటూనే లవ్‌లో పడింది.. త్వరలో ఎంగేజ్‌మెంట్ కూడా..
ABN , First Publish Date - 2023-04-06T19:34:38+05:30 IST
ఈ నెల పదిన వారి ఎంగేజ్‌మెంట్ ఉందని ముంబైలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ(Rajya Sabha) రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా(Parineeti Chopra) త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల పదిన వారి ఎంగేజ్‌మెంట్ ఉందని ముంబైలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతకాలంగా వీరు ఎక్కడికెళ్లినా కలిసి వెళ్తున్నారు. ముంబై, ఢిల్లీలో కెమెరాలకు చిక్కారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎంపీ సంజీవ్ అరోరా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాలకు అభినందనలు తెలిపారు. దీంతో వీరికి ఇప్పటికే పెళ్లైపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇద్దరూ నవ్వులు చిందిస్తున్నారే తప్ప విషయం తేల్చడం లేదు. ఏదైనా విశేషం ఉంటే తామే మీడియాకు చెబుతామంటూ దాటేస్తున్నారు.
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత. పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్‌కు తోడుగా ఉన్నారు. టెలివిజన్ చర్చల్లో ఆప్ వాదాన్ని బలంగా వినిపించగలరని పేరుంది. ఆప్ తరపున ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.
పరిణితీ చోప్రా మోడల్ గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారింది. ఇషాక్ జాదే, దావత్ ఎ ఇష్క్, కిల్ దిల్ తదితర చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంక చోప్రాకు పరిణితీ చోప్రా కజిన్. గతంలో మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజకీయ నేతను మాత్రం చేసుకోనని చెప్పింది. ఇప్పుడు మాత్రం పక్కా పొలిటీషియన్‌ను ప్రేమించి మరీ పెళ్లిచేసుకోబోతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.