RJD Leader : శ్రీకృష్ణుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు : తేజ్ ప్రతాప్ యాదవ్

ABN , First Publish Date - 2023-03-23T15:54:51+05:30 IST

రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ( ఓ ఆసక్తికర విషయం చెప్పారు.

RJD Leader : శ్రీకృష్ణుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు : తేజ్ ప్రతాప్ యాదవ్
RJD Leader Tej Pratap Yadav

పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఓ ఆసక్తికర విషయం చెప్పారు. తాను శ్రీకృష్ణ భగవానుడిని స్వప్నంలో దర్శించుకున్నానని చెప్పారు. తాను శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించానని తెలిపారు. కిరీటధారి అయిన శ్రీకృష్ణ భగవానుడి చేతుల్లో చక్రం, ఇతర ఆయుధాలు తనకు కనిపించాయన్నారు.

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అద్భుతంగా అలంకరించిన ఆయుధాలు, మిరుమిట్లుగొలిపే చక్రంతో కిరీటం ధరించిన నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను. విశ్వకాంతి అద్భుతంగా ప్రకాశిస్తోంది’’ అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో తేజ్ ప్రతాప్ నిద్రపోతున్నట్లు కనిపించింది. మహాభారత యుద్ధం, శ్రీకృష్ణుడులను స్వప్నంలో చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురై, నిద్ర నుంచి మేల్కొన్నట్లు కనిపించింది.

తేజ్ ప్రతాప్ గతంలో కూడా తన కలల గురించి చెప్పారు. పాట్నాలో సచివాలయానికి సైకిల్‌పై వెళ్లినపుడు ఆయన మాట్లాడుతూ, తాను కలలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను చూశానని, ఆయన స్ఫూర్తితోనే సైకిల్‌పై సచివాలయానికి వచ్చానని చెప్పారు.

తేజ్ ప్రతాప్ భగవాన్ శ్రీకృష్ణుడు మాదిరిగా ముస్తాబవడంలో మంచి పేరు పొందారు. తన సోదరుడు తేజస్వి యాదవ్ ‘అర్జునుడు’ అని, తాను ‘శ్రీకృష్ణుడు’ అని చెప్తూ ఉంటారు. పాట్నాలో శివాలయాన్ని సందర్శించినపుడు ఆయన శివుడిలా ముస్తాబయ్యారు.

ఇవి కూడా చదవండి :

Modi surname: ఊహించని పరిణామం... రాహుల్‌కు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్

Congress : అందుకే రాహుల్ గాంధీకి శిక్ష : జైరామ్ రమేశ్

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-03-23T15:54:51+05:30 IST

News Hub