Annoying call : రోజుకు ఒకటైనా చికాకు కలిగించే కాల్!
ABN , First Publish Date - 2023-02-18T00:06:03+05:30 IST
వెలుగును ఆనుకుని చీకటి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఒనగూడే ప్రయోజనాలు వాటి వెంటే ఇబ్బందులూ ఉంటాయి. వాటిలో ఒకటి చీకాకు కలిగించే

వెలుగును ఆనుకుని చీకటి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఒనగూడే ప్రయోజనాలు వాటి వెంటే ఇబ్బందులూ ఉంటాయి. వాటిలో ఒకటి చీకాకు కలిగించే కాల్స్. రోజులో ఒకటైనా చీకాకు పెట్టించే కాల్‌ను ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ రిసీవ్ చేసుకుంటున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్ ఫర్మ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వే ప్రకారం ‘డోంట్ డిస్ట్రబ్’ లిస్ట్‌లో చేర్చినప్పటికీ రోజుకు ఒకటైనా ఇబ్బంది కలిగించే కాల్‌ను స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 92 శాతం మంది అందుకుంటున్నట్టు తేలింది. అలాగే వాటిలో 78 శాతం కాల్స్ రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు సంబంధించినవే అయి ఉంటున్నాయి. ఈ సర్వేకు 11,157 మంది మొబైల్ యూజర్లు స్పందించారు. రోజుకు సగటున మూడు కాల్స్ అలాంటివే వస్తాయని రెస్పాండెంట్లలో 66 శాతం మంది తెలిపారు. 16 శాతం మంది రోజులో ఆరు నుంచి పది కాల్స్ అలాంటివి అందుకుంటున్నట్టు చెప్పారు. కేవలం అయిదు శాతం మంది మాత్రం తాము పది వరకు కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 342 జిల్లాల నుంచి నెల రోజుల పాటు ఈ సర్వే నిర్వహించారు.