Knee Pain : ఇంకెన్నాళ్లు మోకాళ్ల నొప్పులు భరించాలి? ఆపరేషన్‌తో పని లేకుండా దాని పని పడదామా?
ABN , First Publish Date - 2023-01-31T00:15:30+05:30 IST
హెల్సియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్లో అత్యాధునిక వైద్యం. హై డెన్సిటీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ ద్వారా దీర్ఘకాలిక నొప్పులకు చెక్ ఎఫ్‌డిఎ అప్రూవ్‌డ్ ట్రీట్మెంట్

హెల్సియోన్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్లో అత్యాధునిక వైద్యం.
హై డెన్సిటీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ ద్వారా దీర్ఘకాలిక నొప్పులకు చెక్
ఎఫ్‌డిఎ అప్రూవ్‌డ్ ట్రీట్మెంట్
సాధారణంగా చాలా మందికి వచ్చే ఆరోగ్య సమస్యల్లో మోకాళ్ల నొప్పులు ప్రధానమైనవి. గతంలో 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ నొప్పులను ఎదుర్కొనేవాళ్లు. కానీ మారిన ఆహారపుటలవాట్లు, జీవనశైలి వల్ల 30 ఏళ్లకే మోకాళ్ల నొప్పుల బారిన పడే వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందిస్తే, సర్జరీతో పని లేకుండానే మోకాళ్ల నొప్పులను నివారించుకోవచ్చు అంటున్నారు ప్రముఖ నొప్పి నివారణ వైద్యులు, హెల్సియోన్ పెయిన్ మ్యానేజ్‌మెంట్ వ్యవస్థాపకులైన డాక్టర్ పి.ఎ్‌స.ఎస్ కిరణ్, డాక్టర్ డి. పల్లవి. సర్జరీతో పని లేకుండా మోకాళ్ల నొప్పులను తగ్గిం చే చికిత్స పేరేంటి? దాన్నెలా చేస్తారు? దాంతో రోగులకు చేకూరే ప్రయోజనాలేంటి? తదితర వివరాలను చూద్దాం!
హై డెన్సిటీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఏంటి?
రోగి రక్తాన్ని ఒక స్పెషల్ ట్యూబ్‌లో తీసుకుని, సెంట్రిఫ్యూజ్ మిషన్లో ప్రాసెస్ చేసి, ప్లేట్‌లెట్స్‌ను వేరు చేస్తారు. ఈ ప్లేట్‌లెట్స్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్‌ను మోకాళ్లలో గుజ్జు అరిగిపోయిన ప్రాంతంలో స్కానింగ్ మిషన్‌తో ఇంజెక్ట్ చేస్తారు.
ఈ చికిత్స నొప్పిని ఎలా తగ్గిస్తుంది?
ప్లేట్‌లెట్స్‌లోని గ్రోత్ ఫ్యాక్టర్స్‌కు పునరుత్పత్తి గుణాలు ఉంటాయి. గుజ్జు అరిగిన చోట హై డెన్సిటీ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాను ఎక్కించడం వల్ల కణజాల పునరుత్పత్తి, కణజాల విస్తరణ జరుగుతుంది.
ఈ చికిత్సతో రోగికి కలిగే లాభాలు
అత్యుత్తమ ఫలితాన్ని అందించే ఈ చికిత్స కేవలం గంటలోనే పూర్తవుతుంది. రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండవలసిన అవసరం లేదు. కేవలం రెండు గంటల్లోనే రోగిని డిశ్చార్జ్ చేస్తారు. ఈ చికిత్సతో ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. రోగి రక్తం నుంచే మెడిసిన్ తయారు చేయడం జరుగుతుంది.
ఏ ఏ నొప్పులకు హెచ్.డి.పి.ఆర్.పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు?
మోకాళ్ల అరుగుదల: హెచ్.డి.పి.ఆర్.పి ట్రీట్మెంట్‌తో మోకాళ్ల అరుగుదలలో అద్భుతమైన ఫలితాలుంటాయని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. మోకాలి ఆస్టియో ఆర్థోటిక్స్‌లో గుజ్జును పెంచి, నొప్పిని తగ్గించి, రోగి తన రోజువారీ పనులను చేసుకోగలిగేందుకు తోడ్పడుతుంది.
భుజం నొప్పి: భుజంలో రొటేటర్ కఫ్ అనే కండరాలుంటాయి. వాటిల్లో చిరుగులు ఏర్పడితే హెచ్.డి.పి.ఆర్.పి ట్రీట్మెంట్‌తో నయం చేయవచ్చు.
మోచేయి నొప్పి: క్రీడాకారులు తరచూ టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో అనే మోచేతి కండరాల నొప్పులకు గురవుతూ ఉంటారు. ఈ అత్యాధునిక హెచ్.డి.పి.ఆర్.పి ట్రీట్మెంట్ ద్వారా ఈ గాయాలను నయం చేసుకోవచ్చు.
ప్లాంటార్ ఫాసియైుటిస్: చాలామందిని మడమ నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నొప్పితో నడవడం కష్టమవుతుంది. ఇలాంటి నొప్పులను కూడా హెచ్.డి.పి.ఆర్.పి ట్రీట్మెంట్‌తో నయం చేసుకోవచ్చు.
పైన చెప్పిన అన్ని రకాల నొప్పులనూ సమర్థంగా నివారించగలిగే హెచ్.డి.పి.ఆర్.పి ట్రీట్మెంట్ ఇప్పుడు హాల్సియోస్ పెయిన్ మేనేజ్‌మెంట్ సెంటర్లో అందుబాటులో ఉంది. మధ్య తరగతి ప్రజలు కూడా ఈ అత్యాధునిక ట్రీట్మెంట్ చేయించుకునేందుకు వీలుగా ధరలు అందుబాటులో ఉన్నాయి.