హెడ్‌ ఫోన్లలో మల్టీ పాయింట్‌ కనెక్షన్‌

ABN , First Publish Date - 2023-05-20T03:37:26+05:30 IST

రెండు డివైజ్‌లతో ఏకకాలంలో కనెక్ట్‌ కావడమే ఇక్కడ కీలకం. సరికొత్త హెడ్‌ఫోన్‌ లేదంటే టీడబ్ల్యుఎస్‌ ఇయర్‌బడ్స్‌ ఏదైనా సరే దాంతో మల్టీ కనెక్టివిటీకి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

హెడ్‌ ఫోన్లలో మల్టీ పాయింట్‌ కనెక్షన్‌

రెండు డివైజ్‌లతో ఏకకాలంలో కనెక్ట్‌ కావడమే ఇక్కడ కీలకం. సరికొత్త హెడ్‌ఫోన్‌ లేదంటే టీడబ్ల్యుఎస్‌ ఇయర్‌బడ్స్‌ ఏదైనా సరే దాంతో మల్టీ కనెక్టివిటీకి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్స్‌ లేదంటే స్మార్ట్‌ వాచీల్లో ఏ రెంటితోనైనా ఒకే సమయంలో కనెక్ట్‌ అయ్యేందుకు ఈ ఫీచర్‌ సానుకూలపరుస్తుంది.

ఒక స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను తీసుకుంటే రెంటితో కనెక్ట్‌ అయ్యేందుకు ఇలా చేయాలి. మొదట బ్లూటూత్‌ సహకారంతో స్మార్ట్‌ఫోన్‌ను కలుపుకోవాలి. ల్యాప్‌టాప్‌తో హెడ్‌ఫోన్లను ఉపయోగించుకోవాలి అనుకుంటే. బ్లూటూత్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. అప్పుడు దేనినీ డిస్‌కనెక్ట్‌ చేయకుండా రెంటినీ ఏకకాలంలో అటూ ఇటూ స్విచ్‌ అవుతూ కలిపి ఉపయోగించుకోవచ్చు. ల్యాప్‌టాప్‌పై ఒకవైపు ఆఫీసు పని చేసుకుంటూనే మరోవైపు ఏ మాత్రం వీలున్నా స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న కనెక్షన్‌తో ఇష్టమైన మ్యూజిక్‌ వినొచ్చు. ఏదీ డిస్ట్రబ్‌ కాకుండా, ఒక దాని నుంచి మరొకటికి స్విచ్‌ అవుతూ మన పనులు కానిస్తూ ఉండొచ్చు. అన్నింటికంటే ముఖ్యం ఈ రెండూ వైర్‌లెస్‌ కనెక్షన్సే. మల్టీపాయింట్‌ కనెక్షన్‌ కారణంగా ముఖ్యమైన కాల్స్‌ లేదంటే మెసేజ్‌లను మిస్‌ అయ్యే ప్రమాదం ఉండదు. ఒఈం అంటే వేర్వేరు సంస్థల నుంచి తెచ్చిన విడివిభాగాలను కలిపి డివైజ్‌లను రూపొందించుకునే విధానం ప్రస్తుతం నడుస్తోంది. ఫలితంగా బ్రాండ్‌ పేరిట ఎలాంటి అవరోధం ఉండదు. వేర్వేరు ఉత్పత్తులను ఒకే సమయంలో ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడే ఉందని గుర్తుంచుకోవాలి.

Updated Date - 2023-05-20T03:37:26+05:30 IST