Indian Expats: గల్ఫ్ నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా స్కెచ్ ప్రకారం రాత్రికి రాత్రే..
ABN , First Publish Date - 2023-09-15T10:37:35+05:30 IST
వివాహేతర సంబంధంతో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
రాజన్న సిరిసిల్ల, చందుర్తి: వివాహేతర సంబంధంతో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ కిరణ్‌కుమార్, గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పడిగెల నరేష్ (28) అనే యువకుడు గత 5 సంవత్సరాల నుంచి గల్ఫ్ వెళ్లి వస్తున్నాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఈ విషయం భర్తకు తెలిసి ఐదేళ్ల క్రితం గొడవలు జరిగాయి. దాంతో నరేష్ గల్ఫ్ వెళ్లాడు. అనంతరం మహిళ భర్త మల్లేశం కూడా గల్ఫ్ వెళ్లాడు.
ఈ క్రమంలో గత ఆగస్టు 29న నరేష్ స్వగ్రామమైన మల్యాలకు చేరుకొని మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న మల్లేశం రహస్యంగా మల్యాల చేరుకొని పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉన్న నరేష్‌ను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. మృతుడి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.