UK visa rules: రిషి సునాక్ సంచలన నిర్ణయం.. వీసా నిబంధనలు మరింత కఠినతరం.. భారతీయులపై ఎఫెక్ట్
ABN , First Publish Date - 2023-12-05T10:41:58+05:30 IST
Rishi Sunak toughens UK visa rules: వచ్చే ఏడాది యూకే (United Kingdom) లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా రిషి సునాక్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా దేశంలోకి వలసల నిరోధానికి బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Rishi Sunak toughens UK visa rules: వచ్చే ఏడాది యూకే (United Kingdom) లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా రిషి సునాక్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా దేశంలోకి వలసల నిరోధానికి బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అధికవేతనాలున్న వారికే ఉపాధి వీసాలు దక్కేలా కొత్త నిబంధనలు అమలు చేయాలనే నిర్ణయానికి అక్కడి గవర్నమెంట్ వచ్చింది. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ తాజాగా బిల్లు పెట్టారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక తాజా బిల్లులో వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులు చేశారు.
Indian Embassy: కువైత్‌లోని ఇండియన్ డెలవరీ డ్రైవర్లకు ఎంబసీ కీలక సూచనలు.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ..
వీసా నిబంధనల్లో మార్పులు
* బ్రిటన్ స్కిల్డ్ వర్కర్ వీసా (Britain Skilled Worker Visa) పొందేందుకు గతంలో కనీస వేతనం 26,200 పౌండ్లు (రూ.27.61లక్షలు) గా ఉండేది. ఇప్పుడీ వేతనాన్ని ఏకంగా 38,700 పౌండ్ల (రూ.40.78లక్షలు) కు పెంచారు.
* కుటుంబ వీసాకు గతంలో కనీస వేతనం 18,600 (రూ.19.59లక్షలు) కాగా, ప్రస్తుతం దీన్ని కూడా 38,700 పౌండ్ల (రూ.40.78లక్షలు) కు పెంచడం జరిగింది.
* ఇక హెల్త్ అండ్ కేర్ వీసాదారులు (Health and Care visa Holders) ఇకపై తమ కుటుంబ సభ్యులను ఆ దేశానికి తీసుకువెళ్లడానికి వీల్లేదు. కేర్ క్వాలిటీ కమిషన్ పర్యవేక్షణలోని కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే వారు ఇతరులకు వీసాలను స్పాన్సర్ చేయగలరు.
* విద్యార్థి వీసా (Student Visa) పై ప్రస్తుతం అమలవుతున్న కఠిన నిబంధనలు వలసలను చాలావరకూ తగ్గిస్తుందని రిషి సునాక్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా చదువుల కోసం తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు వారి పేరెంట్స్‌ను తమతో పాటు తీసుకురావడంపై నిషేధాజ్ఞలు విధించింది.