Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా.. ఎప్పుడొస్తుందంటే..!?
ABN , First Publish Date - 2023-09-11T19:19:43+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడింది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడింది. కస్టడీ పిటిషన్‌పై తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఇవాళ ఉదయం నుంచి వాడివేడిగా ఇరువర్గాల వాదనలు జరిగాయి. సాయంత్రం 4:30 గంటలకు తీర్పు వస్తుందని కూడా ప్రకటించారు కానీ.. చివరి నిమిషంలో మళ్లీ ఇరువర్గాల నుంచి వాదనలను వినాల్సి వచ్చింది. దీంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కోర్టు తీర్పుపై రేపటి వరకూ సస్పెన్షన్ కొనసాగనుంది.
టెన్షన్.. టెన్షన్..!
ఇవాళ ఉదయం నుంచి కస్టడీ విషయమై వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత.. నిశితంగా పరిశీలించి న్యాయమూర్తి ఇలా తీర్పు వెలువరించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy).. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddartha Luthra) వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హౌస్ కస్టడీ ఎందుకివ్వాలి..? అని ఇదివరకటి హౌస్ కస్టడీ కేసులు ఏంటి..? అని న్యాయమూర్తి క్లారిఫికేషన్ కోరగా.. దీంతో మళ్లీ లూథ్రా, పొన్నవోలు ఇద్దరూ వాదనలు వినిపించాల్సి వచ్చింది. ఈ వాదనలతో తీర్పు మరింత ఆలస్యమైంది. ఇవాళ ఏ సమయం అయినా సరే తీర్పు వస్తుందని అనుకున్నప్పటికీ ఆఖరికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఉత్కంఠ సాయంత్రం వరకూ కొనసాగింది. ఆఖరికి అది సస్పెన్షన్‌గా మిగిలిపోయింది.
లూథ్రా ఏం వాదించారు..?
చంద్రబాబుకు జైలు సేఫ్ కాదు
చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉంది
చంద్రబాబు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్నారు
చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది
అందుకే చంద్రబాబును హౌస్ రిమాండ్‌కు ఇవ్వండి
జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారు
ప్రభుత్వం చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించింది
సెక్యూరిటీపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలులో ఉంది
చంద్రబాబుకు కేంద్రం హైసెక్యూరిటీ కల్పించింది
గౌతమ్ నవలకర్ కేసులో హౌస్ రిమాండ్ ఇవ్వవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పును ఉదహరించిన లూథ్రా
సీఐడీ తరఫున పొన్నవోలు ఇలా..?
చంద్రబాబు హౌస్ కస్టడీని సీఐడీ వ్యతిరేకిస్తోంది
సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదు
చంద్రబాబు ఆరోగ్య కారణాలను పరిశీలించాలి
సెంట్రల్ జైలులో అన్ని విధాలా భద్రత ఉంది
చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు
చంద్రబాబు భద్రతపై అన్ని చర్యలు తీసుకున్నాం
ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే అదనపు సెక్యూరిటీ పెట్టాం
సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం
ఇంటికంటే రాజమండ్రి జైలే బెటర్ సేఫ్ ప్లేస్
చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్యే ఉన్నారు
రక్షణ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుంది
ఇక పిటిషనర్ ఆరోగ్యం కోసం 24X7 వైద్యులు అక్కడే ఉంచారు
చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వైద్యులు వహిస్తారు అని సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, శ్రీరామ్, వివేకానంద కోర్టులో వాదించారు.