Political BRO : ‘బ్రో’ సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-03T17:33:10+05:30 IST

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది...

Political BRO : ‘బ్రో’ సినిమాపై ఆగని రచ్చ.. ఢిల్లీ వేదికగా మరోసారి మంత్రి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ (BRO) మూవీపై ఏపీ రాజకీయాల్లో (AP Politics) పెద్ద దుమారమే రేగుతోంది. ఇందులో సీఎం వైఎస్ జగన్ రెడ్డిని (CM YS Jagan Reddy) ఉద్దేశించి కొన్ని డైలాగ్స్, మంత్రి అంబటి రాంబాబు (Minister Rambabu) సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉన్నాయని ఈ మూవీ టీమ్‌పై వైసీపీ శ్రేణులు (YSR Congress) మండిపడుతున్నాయి. ఛాన్స్ దొరికితే చాలన్నట్లుగా మునుపటిలాగే పవన్‌పై సోషల్ మీడియా (Social Media) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే అటు చిత్రబృందం.. ఇటు అంబటి రాంబాబు ఒకరిపై ఒకరు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. బుధవారం నాడు ఢిల్లీకెళ్లిన అంబటి.. ‘బ్రో’ మూవీపై ఫిర్యాదు చేస్తానన్నారు. ఢిల్లీ వేదికగా మీడియా మీట్ నిర్వహించిన మంత్రి.. బ్రో సినిమా, పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Bro-Ambati-Vs-Prudhvi.jpg

బ్రో సినిమాపై ఏమన్నారంటే..?

నా పేరుతో సినిమా క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారు. బ్రో అనేది చచ్చిన సినిమా. బ్రో సినిమాపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వచ్చాను. బ్రో సినిమాలో పాలిటిక్స్ పెట్టారు. . బ్రో సినిమాలో నన్ను పొలి ఉన్న క్యారెక్టర్‌ చూపించి నన్ను గిల్లారు. నీతి నిజాయితీ అంటే నేను అని పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు. కమ్యూనిస్ట్ బ్యాగ్రౌండ్ అంటాడు.అడవుల్లోకి వెళ్ళాలని అనుకున్నాను అంటాడు. బ్రో హీరో పారదర్శకంగా ఉంటాను అంటారు. పారితోషికం ఎంత తీసుకున్నారో.. నిర్మాత ఎంత ఇచ్చారో చెప్పాలి. పవన్‌ని అంటే చంద్రబాబుకు గుచ్చుకుంటుంది అని రాంబాబు చెప్పుకొచ్చారు.

Ambati-Dance.jpg

పోలవరం ప్రాజెక్టుపై..!

కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను (Gajendra Singh Shekhawat) కలిశాను. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరాను.. వస్తానని చెప్పారు. డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని నిపుణులు ఆలోచిస్తున్నారు. మా హయాంలో గైడ్ బండ్ కుంగిపోయింది, కారణాలు తెలుసుకోవడానికి నిజ నిర్ధరణ కమిటీ వేశాం. దాదాపు 100 కోట్లు నష్టం జరిగింది. సమస్యలు అన్ని పూర్తయిన తర్వాతనే పోలవరం పూర్తిపై స్పష్టత ఇవ్వగలం. చంద్రబాబు (TDP Chief Chandrababu) తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తింది. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు 2500 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతి ఎకరానికి నీరు ఇచ్చేస్తా అని అన్నాడు. 14 ఏళ్లు సీఎం ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు ఆపిన ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి (YS Rajasekhar Reddy) పూర్తి చేశారు.చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

rambabu.jpg


ఇవి కూడా చదవండి


AP Debts : ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఏమయ్యారు.. ఎందుకీ మౌనవ్రతం..!?


AP Politics : విశాఖ వైసీపీలో రివర్స్ గేర్.. ఏ ఒక్కర్ని కదిపినా పరిస్థితేంటో అని జగన్‌లో పెరిగిన టెన్షన్!?


TS Politics : బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిద్దామనుకున్న కేసీఆర్‌కు బిగ్ ఝలక్.. నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలు ఔట్!?


ABN Fact Check : గుడివాడలో నానిని దెబ్బకొట్టేందుకు ‘నారా’స్త్రం.. నిజంగానే నారా రోహిత్‌ బరిలోకి దిగుతున్నారా..!?


TS Politics : కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం.. దాసోజుకు లక్కీ ఛాన్స్.. దానంకు లైన్ క్లియర్!


TSRTC : ఎన్నికల ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం


Manoj Meets CBN : చంద్రబాబుతో భేటీ తర్వాత మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫిక్స్ అయినట్లే..!


AP Politics : చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ.. ఇందుకేనా..!?


Updated Date - 2023-08-03T17:41:48+05:30 IST