Vishnukumar Raju Open Heart With RK: ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు విష్ణుకుమార్ రాజుకు బీజేపీ నోటీసులు..!

ABN , First Publish Date - 2023-05-08T11:38:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

Vishnukumar Raju Open Heart With RK: ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు విష్ణుకుమార్ రాజుకు బీజేపీ నోటీసులు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఇంటర్వ్యూలో కేంద్రంపై, పార్టీపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో బీజేపీ పేర్కొంది. ప్రధాని సమావేశం వివరాలను తప్పుగా చిత్రీకరించడం బాధాకరమని బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఏపీ సర్కార్‌పై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విష్ణుకుమార్‌రాజు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. విష్ణుకుమార్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు నోటీసులో బీజేపీ వెల్లడించింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని ఇరుకున పెట్టాలని చూస్తున్నారంటూ నోటీసులు ఇస్తూ.. పొత్తులపై వ్యాఖ్యలు మీ పరిధిలోనివి కావని నోటీసులో విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి బీజేపీ పార్టీ ప్రస్తావించింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-05-08T11:41:36+05:30 IST