KTR Twitter: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ట్విట్టర్‌లో కేటీఆర్ ఫైర్..
ABN , First Publish Date - 2023-03-11T23:06:13+05:30 IST
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)పై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. కిషన్‌రెడ్డిపై ట్విట్టర్‌లో కేటీఆర్ సెటైర్లు వేశారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)పై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. కిషన్‌రెడ్డిపై ట్విట్టర్‌లో కేటీఆర్ సెటైర్లు వేశారు. ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరు? అని కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ పుట్టుకనే మోదీ అవమానించారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థంకాదని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ను మోదీనే కనిపెట్టారనే ఫేకుడు మానుకోండి అని కేటీఆర్ సూచించారు. ప్రజలకు పనికి వచ్చే పనులు చేయండి అంటూ ట్విట్టర్‌లో కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) పై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం వ్యాపారం చేయకపోతే ఎందుకు భూజాలు తడుముకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రూ. లక్షల విలువైన ఫోన్లను కవిత ఎందుకు ధ్వంసం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. లక్షల విలువైన ఫోన్లను మిగతవారంతా ఎందుకు ధ్వంసం చేయలేదని, కవిత మాత్రమే ఎందుకు ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి తమరే ఇరుక్కున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor scam)తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్‌పై అన్నా చెల్లెలు (KTR, Kavitha) ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేటీఆర్, కవితను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్ స్కామ్ చేయాలని చెప్పామా అంటూ కేటీఆర్, కవిత(KTR, Kavitha)లను కిషన్ రెడ్డి ప్రశ్నించారు.