Modi Hyderabad Tour : మోదీ తెలంగాణ పర్యటనలో చేసిందేంటి.. కేసీఆర్ సర్కార్‌పై ఏం మాట్లాడారు..!?

ABN , First Publish Date - 2023-04-08T12:08:28+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సై అంటే సై అంటున్న వాడివేడి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఉదయం 11.30 గంటలకు నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకున్నారు. ప్రధానికి...

Modi Hyderabad Tour : మోదీ తెలంగాణ పర్యటనలో చేసిందేంటి.. కేసీఆర్ సర్కార్‌పై ఏం మాట్లాడారు..!?

02:00pm : మోదీ వచ్చి చేసిందేంటి..?

  • మోదీ ప్రసంగం ముగిసిన నిమిషాల వ్యవధిలోనే బీఆర్ఎస్ నేతల ప్రెస్‌మీట్లు

  • మోదీ తెలంగాణకు వచ్చి చేసిందేంటి..? అంటూ ప్రధానిపై ప్రశ్నల వర్షం

  • ఏదో ప్రకటన ఉంటుందని తెలంగాణ ప్రజలు ఎదురుచూశారు : బీఆర్ఎస్ నేతలు

  • మోదీ నోటి నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన ప్రజలు : బీఆర్ఎస్ నేతలు

  • మోదీ ప్రారంభించిన జాతీయ రహదారులకు.. కేంద్రానికి సంబంధమేంటని ప్రశ్నలు

  • కుటుంబ పాలనపై మోదీ మాట్లాడటమా..? అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం

13:40 pm : ముగిసిన మోదీ హైదరాబాద్ పర్యటన

  • హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన

  • భాగ్యనగర పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పరేడ్ గ్రౌండ్స్‌ బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి నేరుగా చెన్నైకి బయల్దేరిన మోదీ

Modi-Tour-OVer.jpg

01:36pm : ఇదే మా లక్ష్యం..

  • అన్ని విషయాల్లో తమ కుటుంబ స్వార్ధం చూసుకుంటున్నారు: మోదీ

  • ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారు

  • ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం

Modi-Pared-Ground-Sabha.jpg

01 : 25pm : కేసీఆర్ సర్కార్‌పై ఓ రేంజ్‌లో పంచ్‌ల వర్షం

  • కేసీఆర్ సర్కార్‌పై మాట్లాడుతారని ముందే ఊహించిన బీజేపీ శ్రేణులు

  • తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: మోదీ

  • అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది: మోదీ

  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మా లక్ష్యం..

కానీ కొందరు అభివృద్ధిని కావాలని అడ్డుకుంటున్నారు

  • రాష్ట్రంలో కుటుంబం పాలన, అవినీతిని పెంచిపోషిస్తున్నారు

  • నిజాయితీగా పనిచేసేవారంటే వారికి నచ్చడం లేదు

  • తెలంగాణలో కుటుంబపాలనతో అవినీతి పెరిగింది

    కొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోంది

  • రాష్ట్రంలో కొంతమంది ప్రగతి నిరోధకులుగా మారారు

  • ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టాం

  • నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లోనే నిధులు వేస్తున్నాం: మోదీ

Modi-Hyderabad-Tour-OVer.jpg

  • కుటుంబవాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలనుకున్నారు

  • వారి నియంత్రణను ఎవరు సవాల్‌ చేయకూడదనుకుంటారు

  • డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా చేశాం

  • రాష్ట్రాభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రాలేదు

  • దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?

  • అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా?

  • అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?

  • నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి: ప్రధాని మోదీ

  • కోర్టుకు వెళ్లారు.. అక్కడా వారికి షాక్‌ తగిలింది..

  • వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్‌ కూలా లాక్కున్నారు

  • 80 కోట్ల మందికి నేడు ఉచితంగా రేషన్‌ అందిస్తున్నాం : మోదీ

Kcr-and-Modi-Sabha.jpg

01 : 10pm : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

  • కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

  • ఒకే రోజు 13 MMTS రైళ్లను ప్రారంభించాం

  • దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాం

  • హైదరాబాద్‌- బెంగళూరు అనుసంధాన్ని మెరుగుపరుస్తున్నాం

  • మౌలిక వసతుల కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించాం: మోదీ

  • తెలంగాణలో నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాం

  • కల్వకుర్తి- కొల్లాపూర్‌, మహబూబ్‌నగర్‌- చించోలి రోడ్డు విస్తరణ పనులు

  • హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉంది

  • పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం చేయూత ఇస్తోంది

  • దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కులు: ప్రధాని మోదీ

  • తెలంగాణలో కూడా మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు చేస్తాం

Modi-TS.jpg

12:36 pm : ప్రధాని ప్రసంగం ప్రారంభం

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ

  • ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ప్రారంభం

  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ..

  • ప్రసంగంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రస్తావించిన ప్రధాని

  • ఇంతవరకూ ఏ ప్రసంగంలోనూ ఆలయం ప్రస్తావన తీసుకురాని మోదీ

  • సడన్‌గా మోదీ ఈ ప్రస్తావన తీసుకురావడంతో సర్వత్రా చర్చ

Modi-Speech.jpg

12:50pm : అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి

  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి: అశ్వినీ వైష్ణవ్‌

  • 9 ఏళ్లల్లో రైల్వేరంగాన్ని ప్రధాని మోదీ సమూలంగా మార్చారు: అశ్వినీ వైష్ణవ్‌

  • ఒకే రోజు 13 MMTS రైళ్లను ప్రారంభిస్తున్నాం: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

  • తెలుగు ప్రజలకు వెంకటేశ్వరస్వామి దర్శనం సులభం అవుతోంది: అశ్వినీ వైష్ణవ్‌

12:43 pm : అభివృద్ధి పనులకు అంకురార్పణ

  • ఐదు జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన

  • హైదరాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు ప్రారంభం

  • మేడ్చల్, బొల్లారం, ఉందానగర్‌కు MMTS సేవలు

  • రిమోట్ ద్వారా శిలాఫలకాలు ఆవిష్కరించిన మోదీ

Railway-Modi.jpg

12:40 pm : తెలంగాణకు గిఫ్ట్‌గా..

  • దేశంలో 14 వందేభారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి- కిషన్ రెడ్డి

  • అందులో 2 తెలంగాణకే మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు- కిషన్ రెడ్డి

Kishan-Reddy.jpg

12:36pm : మోదీకి కానుక

  • ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కానుక

  • వేంకటేశ్వరస్వామి విగ్రహం అందజేసిన కిషన్ రెడ్డి

12:34 pm : తరలివచ్చిన కాషాయ దళం

  • ప్రధాని మోదీ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు

  • మోదీ ప్రసంగం కోసం వేయికళ్లతో ఎదురుచూపులు

  • కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేసే ఛాన్స్

BJP-Activists.jpg

12:18pm : ఏం మాట్లాడుతారో..?

  • పరేడ్ గ్రౌండ్ సభా వేదికకు చేరుకున్న ప్రధాని మోదీ

  • పూర్తి భద్రతా వలయంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాలు

  • కాసేపట్లో ప్రధాని ప్రసంగం

  • ప్రధాని ఏం మాట్లాడుతారా అని అటు బీజేపీలో ఉత్కంఠ.. ఇటు బీఆర్ఎస్ టెన్షన్

Modi-Pared-Ground.jpg

12:10pm : రెడీ.. వన్, టూ, త్రీ

  • సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభం

  • జెండా ఊపి రైలును ప్రారంభించిన మోదీ

  • తిరుపతి వెళ్తున్న ప్రయాణికులు, విద్యార్థులను పలకరించిన ప్రధాని

  • అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న ప్రధాని

Modi-Vande-Bharath.jpg

భాగ్యనగరానికి నమో..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సై అంటే సై అంటున్న వాడివేడి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఉదయం 11.30 గంటలకు నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని, ఎంపీ బండి సంజయ్ పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు గంటలపాటు హైదరాబాద్‌లో మోదీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని.. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. దీంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పరిశీలించి మొదటి కోచ్‌లోని చిన్నారులతో, డ్రైవింగ్‌ క్యాబ్‌లోని సిబ్బందితో మోదీ మాట్లాడారు. అనంతరం జెండా ఊపి సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. ఇక్కడ్నుంచి నేరుగా పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలో పలువురు ప్రముఖులతో పాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తదితరులు మోదీకి స్వాగతం పలికి ఘనంగా సన్మానిస్తారు. ఈ సభలో మోదీ సుదీర్ఘ ప్రసంగం చేసే ఛాన్స్ ఉంది. మోదీ ఏం మాట్లాడుతారు..? గత కొన్నిరోజులుగా తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలపై విమర్శలు, కౌంటర్లు ఉంటాయని..? అని బీజేపీ శ్రేణులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.

Modi-Hyderabad.jpg

ఈ బహిరంగ సభ అనంతరం రోడ్డు రవాణా శాఖ ప్రాజెక్టులకు, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ నూతన భవన సముదాయానికి (వర్చువల్‌గా), సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య పూర్తి చేసిన డబ్లింగ్‌, విద్యుద్దీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మధ్య కొత్త ఎంఎంటీఎస్‌ సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. 1.30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఢిల్లీ వెళతారు.

Updated Date - 2023-04-08T14:07:14+05:30 IST