TS Politics : కేసీఆర్‌కు ఊహకందని షాకివ్వబోతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్ తర్వాత ఇదే రికార్డ్..!?
ABN , First Publish Date - 2023-08-24T19:22:10+05:30 IST
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా..? రాజకీయ చాణక్యుడికే ఝలక్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ప్లాన్ చేసిందా..? ..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (CM KCR) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఊహించని షాక్ ఇవ్వబోతున్నారా..? రాజకీయ చాణక్యుడికే ఝలక్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ప్లాన్ చేసిందా..? రేవంత్ త్వరలో చేయబోయే ప్రకటనతో బీఆర్ఎస్ (BRS) ఉలిక్కిపడనుందా..? సరైన సమయంలో బీఆర్ఎస్‌ను హస్తం పార్టీ దెబ్బకొట్టనుందా..? అంటే గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ వేసిన ప్లానేంటి..? ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఇంతకీ ఏంటది..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ విజయకేతనం ఎగరేసిన తర్వాత.. తెలంగాణలో ఆ పార్టీకి మునుపెన్నడూలేని జోష్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక మిగిలింది తెలంగాణ (TS Assembly Polls) మాత్రమేనని.. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు (Congress Leaders). ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకొని ముందుకెళ్తున్నారు. అందుకే మొదట వర్గ విభేదాలు, అసంతృప్తి, నేతల మధ్య గొడవలు, ఒకరిపై ఒకరు విమర్శలు ఇలాంటివి లేకుంటే అందరూ ఒక్కటై ముందుకు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐక్యమత్యంగా ఉండి.. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. ముఖ్యంగా అధికార పార్టీకి అంచనాలకు అందకుండా.. కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. 115 మంది అభ్యర్థులను (115 BRS MLAs List) కేసీఆర్ఒకేసారి ప్రకటించడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్నది. ఇంకో 4 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ 115 మందిలో పలువురు సిట్టింగ్‌లు టికెట్లు కోల్పోగా.. అంతకుమించి కొత్త ముఖాలు ఉన్నాయి. దీంతో టికెట్ రాని సిట్టింగులకు, ఆశావాహులకు, ఆ అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఇవన్నీ అటుంచితే.. గులాబీ బాస్‌కు ఊపిరిపీల్చుకోలేని విధంగా షాకివ్వడానికి రేవంత్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేశారట. అదేమిటంటే.. 119 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడమే.. ఆ ప్లాన్. వాస్తవానికి మొదటి జాబితాలో 40 నుంచి 45 మంది వరకు అభ్యర్థులను ప్రకటించాలని భావించినప్పటికీ తర్వాత మనసు మార్చుకున్న హైకమాండ్.. ఒకేసారి ఒకే జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల చివరిన లేదా సెప్టెంబర్-01, 02 తారీఖుల్లో ప్రకటన ఉంటుందని టాక్ నడుస్తోంది.
వెల్‌కమ్.. వెల్‌కమ్!
అటు బీఆర్ఎస్ జాబితా వచ్చిందో లేదో.. ఇటు గాంధీ భవన్‌లో వెల్ కమ్ బోర్డులు పెట్టేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక తగ్గేదేలే అన్నట్లుగా అసంతృప్తులకు గాలం వేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని.. టికెట్ కోసం దరఖాస్తులు కూడా చేసుకోగా.. మరికొందరు అదే బాటలో నడవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న మైనంపల్లి హన్మంతరావు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. పైగా ఈ పాయింటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అయ్యింది. మైనంపల్లిని కాంగ్రెస్‌లో చేర్చుకొని కేసీఆర్ మీద పైచేయి సాధించాలని.. ప్రయత్నాలు మొదలు పెట్టింది హైకమాండ్. ఇప్పటికే పలుమార్లు రాజకీయ వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వేలు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన రిపోర్టు కూడా హైకమాండ్‌కు అందజేయడం జరిగింది. మరోసర్వే వార్ రూమ్ ఇంచార్జీ సెంథిల్ దగ్గర కూడా ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి.. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తే.. రికార్డ్ క్రియేట్ చేసినట్లేనన్న మాట. ఇప్పటికే సవాళ్ల విషయంలో ప్రతిసారీ కేసీఆర్‌పై పైచేయి సాధించిన రేవంత్.. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి.. ఇప్పుడున్న ఇదే జోష్‌ను ఎన్నికల వరకూ కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది..? మున్ముందు బీఆర్ఎస్‌ను ఢీ కొట్టడానికి కాంగ్రెస్ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచిస్తోందనే విషయాలు తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.