YuvaGalam Padayatra : నారా లోకేష్ పాదయాత్రలో ఊహించని సీన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-02-28T18:34:32+05:30 IST
ఒకే ఒక్క ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను (Social Media) షేక్ చేస్తోంది.. ఈ ఫొటో సోషల్ మీడియాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) పెద్ద ఎత్తునే చర్చనీయాంశం అవుతోంది. ..
ఒకే ఒక్క ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను (Social Media) షేక్ చేస్తోంది. నారా లోకేష్-పవన్ (Nara Lokesh-Pawan Kalyan) కల్యాణ్ ఇద్దరూ ఒకే ఫ్లెక్సీలో ఉండటమే ఇందుకు కారణం. ఈ ఫొటో సోషల్ మీడియాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu States Politics) పెద్ద ఎత్తునే చర్చనీయాంశం అవుతోంది. దీనిపై అటు పవన్ అభిమానులు (Pawan Fans).. ఇటు టీడీపీ అభిమానులు (TDP Fans), లోకేష్ వీరాభిమానులు (Nara Lokesh Fans) చిత్రవిచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఫొటో కథేంటి..? ఇంత హాట్ టాపిక్ ఎందుకయ్యింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యువగళం పాదయాత్రకు పెద్దఎత్తున ప్రజాదరణ వస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్రలోలోకేష్‌తో కలిసి చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారు అడుగులో అడుగులేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎత్తిచూపుతూ.. ఆయా నియోజవకర్గాల ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నా.. అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. మరోవైపు.. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan)అభిమానులు కూడా లోకేష్‌కు సాదరంగా స్వాగతిస్తున్నారు. తిరుచానూరు పవన్ వీరాభిమానులు ఏకంగా జనసేనాని-లోకేష్ ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించి మరీ స్వాగతం పలికారు. ఈ ఆసక్తికర సన్నివేశాలు చూసిన జనాలు తమ ఫోన్ కెమెరాలకు పనిచెప్పి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరోచోట చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురూ (Chandrababu, Nara Lokesh, Pawan) కూడా ఓ ఫ్లెక్సీలో ఉన్నారు. ఇప్పుడీ రెండు ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఏమనుకుంటున్నారు..?
ఈ ఫొటోలపై నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు, లోకేష్ వీరాభిమానులు పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం ఈ ఫొటోలను అస్సలు ఒప్పుకోవట్లేదు. అయితే.. టీడీపీ-జనసేన కలిసి పోటీచేయాలనే కోరిక ఇరుపార్టీల కార్యకర్తల్లో కూడా బలంగా ఉందని ఈ ఫొటో ద్వారా తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లో పరిస్థితి అలాగే ఉందని.. ఇక పార్టీలు కూడా ఇదే ఫిక్సవ్వాలని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ‘అవును.. టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తేనే వైసీపీని ఓడించొచ్చు’ అని ఇరుపార్టీల అభిమానులు చెబుతున్నారు. ‘అధిష్టానం పొత్తు పెట్టుకున్నా లేకున్నా కార్యకర్తలు మాత్రం ఫిక్స్ అయ్యారు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు అయితే మునుపటిలాగే ఈ ఫొటోలపై విషం కక్కుతూనే ఉన్నారు.
ఇటీవల లోకేష్ కామెంట్స్ ఇలా..!
పాదయాత్రలో భాగంగా ఒకట్రెండు సందర్భాల్లో లోకేష్ నోట పవన్ కల్యాణ్ మాటొచ్చింది. జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం (Yuvagalam), వారాహి బస్సు యాత్ర (Varahi Bus Yatra) ఆగదని బహిరంగ సభా వేదికగా సవాల్ విసిరారు. అప్పట్లో ఈ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ మధ్య యువతతో ముఖాముఖి నిర్వహించగా పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన వచ్చింది. ‘ఏపీ భవిష్యత్తును మార్చడానికి ముందుకొచ్చేవారిని మేం ఎప్పుడూ ఆహ్వానిస్తాం. రాష్ట్రంలోని సమస్యలను అధిగమించేందుకు మంచి మనసున్నవాళ్లు రావాలి. 2014లో నేను మొదటిసారి పవన్ కళ్యాణ్‌ను కలిశాను. అలాంటి వాళ్లకు మేం రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉంచాం. రాష్ట్రాభివృద్ధి కోసం, సమాజంలో మార్పు తీసుకురావాలన్నా పవన్‌ను ఆహ్వానిస్తున్నాం. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనస్సు. రాష్ట్ర భవిత కోసం ఎవరు పని చేస్తారో వారందరూ రాజకీయాల్లోకి రావాలి’ అని పవన్ గురించి లోకేష్ మాట్లాడారు.
మొత్తానికి చూస్తే .. ఒకే ఒక్క ఫొటో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన అభిమానులు కూడా పొత్తు ఉండాలని ఇలా గట్టిగానే కోరుకుంటున్నారు. ఇక యథావిధిగా వైసీపీ కార్యకర్తలు ఫొటోలపై పైత్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల సమయానికి ఎవరు ఏ పార్టీతో కలుస్తారో.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.