AP Politics : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు.. ముహూర్తం ఫిక్స్..!

ABN , First Publish Date - 2023-08-11T22:37:19+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడిప్పుడే వాటికి ఆ విబేధాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది..

AP Politics : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు.. ముహూర్తం ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడిప్పుడే వాటికి ఆ విబేధాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఈ పరిస్థితుల్లోనే గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుగా నిలవడంతో నాడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంది. రెండ్రోజులకోసారి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఇద్దర్నీ కలిపినప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడటంతో టికెట్ విషయంలో మళ్లీ రచ్చ రచ్చ జరుగుతోంది.


ముహూర్తం ఫిక్స్..!

ఈ గొడవల నేపథ్యంలోనే శుక్రవారం నాడు వైసీపీ, టీడీపీ కార్యకర్తలతో యార్లగడ్డ వెంకట్రావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకే ఆత్మీయ భేటీ అని యార్లగడ్డ వర్గీయులు తేల్చిచెప్పేశారు. యువగళం పాదయాత్రలో టీడీపీలో చేరే అవకాశం ఉందని యార్లగడ్డ అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్య నేతలతో యార్లగడ్డ చర్చించిన విషయం తెలిసిందే. అయితే.. ఎక్కువ శాతం మంది టీడీపీతోనే వెళ్లాలని యార్లగడ్డ ముందు ప్రస్తావన తెచ్చారు. దీంతో ఎల్లుండి అనగా ఆదివారం నాడు జరిగే భేటీలో పార్టీ మార్పుపై యార్లగడ్డ నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 19న యువనేత లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో భాగంగా.. లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఈ మాటలతోనే..!

కాగా.. ఇటీవలే యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘ నేను గన్నవరం రాజకీయాల్లోనే ఉంటా. ఇక్కడి నుంచే పోటీ చేస్తా. ఏ పార్టీ అన్నది కాలమే నిర్ణయిస్తుంది’ అని వెంకట్రావు వ్యాఖ్యానించారు. వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావును హనుమాన్‌ జంక్షన్‌లో కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం వైసీపీలో చర్చనీయాంశం అయ్యాయి. ‘అమెరికాను వదిలేసి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చా. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశా. ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారు. అయినా నేను అమెరికా వెళ్లలేదు. అమెరికాలో వ్యాపారాలు ఉన్నా ఈ ఐదేళ్లలో కేవలం మూడుసార్లే వెళ్లాను. అక్కడ ఏ వ్యాపారాలు లేని ఎమ్మెల్యేలు కూడా నాకంటే ఎక్కువ సార్లే అమెరికా వెళ్లారు’ అని వెంకట్రావు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ అది కాలమే నిర్ణయిస్తుందన్నారు. అయితే, 2024లో గన్నవరం నుంచి పోటీ చేయడం మాత్రం ఖాయమన్నారు. అప్పట్నుంచీ యార్లగడ్డ టీడీపీలో చేరతారని తేలిపోయింది. అయితే శుక్రవారం సమావేశంతో క్లియర్‌కట్‌గా అర్థమైపోయింది.


ఇవి కూడా చదవండి


YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?


AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?


AP Politics : వైసీపీకి బాలినేని శ్రీనివాస్ నిజంగానే గుడ్ బై చెబుతున్నారా..!?


YSRTP : ఢిల్లీకెళ్లిన వైఎస్ షర్మిల హైదరాబాద్‌కు ఎలా వచ్చారంటే.. ఈ ఒక్క సీన్‌తో..!?



Updated Date - 2023-08-11T22:39:20+05:30 IST