AP Politics : పొలిటికల్ కెరీర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2023-08-26T22:36:41+05:30 IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna Raju) పొలిటికల్ కెరీర్‌పై (Political Career) గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు...

AP Politics : పొలిటికల్ కెరీర్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna Raju) పొలిటికల్ కెరీర్‌పై (Political Career) గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. శనివారం నాడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) నిర్వహించిన బిగ్‌ డిబేట్‌లో (ABN Big Debate) రఘురామ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పోటీచేస్తారా.. లేదా..? ఆయన బరిలోకి దిగుతారా లేకుంటే ఎంపీ కుమారుడు భరత్ (Kanamuri Bharath) పోటీచేస్తారా..? ఎన్నికల నాటికి రఘురామ వ్యూహం ఏమిటి..? తండ్రీ, కొడుకులు ఎలా కీలక పాత్ర పోషించబోతున్నారు..? వైసీపీపై రఘురామ ఎలా కసి తీర్చుకోబోతున్నారు..? భరత్ విషయంలో రఘురామ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రఘురామ సమాధానమిచ్చారు.


Vk-and-Raghurama.jpg

ఇదీ అసలు నిజం..

పొలిటికల్ కెరీర్‌పై జరుగుతున్న ప్రచారాన్ని ఏబీఎన్ డిబేట్ వేదికగా రఘురామ కొట్టిపారేశారు. ‘నర్సాపురంలో (Narsapuram) నా ప్రతినిధిగా మాత్రమే భరత్‌ ఉంటాడు. నర్సాపురం పార్లమెంట్‌ ప్రజల ప్రతినిధిగా నేనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి నేనే పోటీచేస్తాను. అయితే నా నియోజకవర్గంలో ప్రచారాన్ని కొడుకు భరత్ చూసుకుంటాడు. నేనే ఏపీలో కీలక జిల్లాల్లొ పర్యటిస్తాను. ప్రజాకంటక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించటమే నా లక్ష్యం’ అని ఎంపీ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వైసీపీపై పగ తీర్చుకోవడానికి రాష్ట్రం మొత్తం పర్యటిస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు.. రాయలసీమ నేతలతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్..అమరావతి ప్రజల గొంతుకోశారని ఆరోపించారు. ప్రతిపక్ష కూటమికి 40 శాతం ఓటింగ్‌ ఉందన్నారు. ఏపీలో ప్రతిపక్ష కూటమి ఉంటుందన్నారు. ప్రతిపక్ష కూటమిలో నర్సాపురం నుంచి పోటీచేస్తారా..? అనే ప్రశ్నకు పై విధంగా రఘురామ సమాధానమిచ్చారు.

R.jpg

రఘురామలో పెరిగిన కసి..!

కాగా.. ఏపీలో చీకటి రోజులు ముగింపు దశకు వచ్చేశాయని రఘురామ కుమారుడు కనుమూరి భరత్ చెప్పారు. కష్టాలు, ఇబ్బందులను మొండిధైర్యంతో ఎదుర్కొంటున్నారని.. త్వరలోనే రఘురామ నియోజకవర్గానికి వస్తారని ప్రజలకు వివరించారు. రానున్నవన్నీ వెలుగులు నింపే రోజులేనని.. భరత్ తెలిపారు. కాగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురంలో రఘురామ ఎంపీగా గెలిచిన విషయం విదితమే. అయితే వైఎస్ జగన్ తీరు నచ్చక సొంత పార్టీపైనే తిరుగుబాటు చేశారు.

RR.jpg

నాటి నుంచి నేటి వరకూ వైసీపీ చేస్తున్న అరాచకాలపై రఘురామ పోరాడుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వాన్ని రోజువారీగా ఎంపీ నిలదీస్తున్నారు. దీంతో రఘురామపై కసిపెంచుకున్న ప్రభుత్వం.. రఘురామను అరెస్ట్ చేసి కస్టడీలో ఏపీ సీఐడీ కొట్టింది. అప్పట్నుంచీ సొంత నియోజకవర్గానికి కూడా రఘురామ వెళ్లలేని పరిస్థితి. నాటి నుంచి రఘురామలో మరింత కసి పెరిగిందని ఆయన అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అయితే.. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా నర్సాపురం ప్రజల బాగోగులు.. అన్నీ తానై భరత్ చూసుకుంటున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో రఘురామ పోటీచేస్తారా..? లేకుంటే భరత్ పోటీచేస్తారా..? అని అభిమానులు, అనుచరుల్లో.. సోషల్ మీడియాలో ప్రశ్నలు మెదిలాయి. దీనిపై ఏబీఎన్ వేదికగా రఘురామ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Raghu-Rama-CID.jpg


ఇవి కూడా చదవండి


National Film Awards : నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు కేసీఆర్ స్పెషల్ విషెస్.. అంతేనా..!?


TS Assembly Polls : ఎన్నికల ముందు ఈ పరిణామాలు దేనికి సంకేతం.. కేసీఆర్ మారిపోయారా.. భయపడ్డారా..!?


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?


Updated Date - 2023-08-26T23:13:05+05:30 IST