Lokesh Yuvagalam : నాన్నను చూడాలని బ్రాహ్మణిని అడిగిన దేవాన్ష్.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా...!
ABN , First Publish Date - 2023-02-12T10:24:12+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూ..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నా.. అడుగు ముందుకేయడానికి పోలీసులు సహకరించకున్నా సరే.. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే లోకేష్‌పై 5 కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలన్నా కనీసం మైక్‌లో మాట్లాడటానికి ఖాకీలు అనుమతివ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. మొదటి రోజు నుంచే ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా 16 రోజులు పాదయాత్ర పూర్తి చేశారు లోకేష్. ఇప్పటి వరకూ 200 కిలోమీటర్ల పాదయాత్ర చేశారాయన.
ఇవాళ పాదయాత్ర ఇలా..
శనివారం నాడు చిత్తూరు (Chittor) జిల్లాలోని శ్రీరంగరాజపురం మండలంలో పాదయాత్ర (Padayatra) జరగ్గా ఇవాళ గంగాధర నెల్లూరు (Gangadhara Nellore) నియోజకవర్గంలో జరగనుంది. 11.30 గంటలకు కొత్తూరు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడిగపల్లెలో గౌడ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 01.55 గంటలకు కొత్తిరివేడు వద్ద స్థానికులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 03.15 గంటలకు భోజన విరామం ఉంటుంది. సాయంత్రం 04.20 గంటలకు గొల్లకండ్రిక వద్ద స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. సాయంత్రం 05.40 గంటలకు డీఎం. పురం గ్రామస్తులతో మాటామంతి జరగనుంది. రాత్రి 07.50 గంటలకు ద్వారకా నగర్‌కు పాదయాత్ర చేరుకోనున్నది. రాత్రి 09.05 గంటలకు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
ఇంటి భోజనం..!
ఇదిలా ఉంటే.. లోకేష్ బస చేస్తున్న కొత్తూరు విడిది కేంద్రానికి శనివారం రాత్రి ఆయన సతీమణి నారా బ్రాహ్మణి (Nara Bramhini), కుమారుడు దేవాన్ష్ (Devansh) చేరుకున్నారు. ‘అమ్మా.. నాన్నను చూడాలి’ అని దేవాన్ష్ అడగ్గా.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి బ్రాహ్మణి కొత్తూరుకు వెళ్లారు. ఇంటి దగ్గర్నుంచి ప్రత్యేకంగా వండిన భోజనాన్ని తనవెంట ఆమె తీసుకెళ్లారని తెలుస్తోంది. కుమారుడు, సతీమణితో కలిసి ఇంటి దగ్గర్నుంచి తెచ్చిన భోజనాన్ని లోకేష్ తిన్నారట. అనంతరం కుమారుడితో కాసేపు సరదాగా గడిపారు. పాదయాత్ర ఎలా సాగుతోంది..? అని లోకేష్, టీడీపీ ముఖ్యనేతలను అడిగి బ్రాహ్మణి అడిగి తెలుసుకున్నారట. పాదయాత్రలో ప్రభుత్వం అడుగడుగునా సృష్టిస్తున్న అడ్డంకులను తెలుగు తమ్ముళ్లు (Telugu Thammullu) ఆమెకు వివరించారట.
లోకేష్‌తో కలిసి అడుగులు..!
ఇవాళ పాదయాత్రలో లోకేష్‌తో కలిసి బ్రాహ్మణి కూడా అడుగులో అడుగులేయనున్నట్లు తెలియవచ్చింది. దేవాన్ష్ కూడా అమ్మ, నాన్నలతో కలిసి పాదయాత్ర చేయున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇవాళ పాదయాత్ర ముగిసేవరకూ బ్రాహ్మణి, దేవాన్ష్ ఇద్దరూ లోకేష్‌తోనే ఉంటారని తెలుస్తోంది. లోకేష్‌తో పాటు సతీమణి కూడా మాటామంతి, ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. పాదయాత్ర ముగించుకుని రాత్రి 09.05 తర్వాత లోకేష్ బస చేసే కేంద్రానికి చేరుకున్నాక.. బ్రాహ్మణి, దేవాన్ష్ హైదరాబాద్‌కు బయల్దేరుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు.