AlluArjun: అభిమానుల కోసం ఐకాన్ స్టార్

ABN , First Publish Date - 2023-02-07T14:31:47+05:30 IST

అల్లు అర్జున్ వైజాగ్ లో ఆదివారం అభిమానులను (Fans meet in Vizag) కలుస్తున్నాడు అని, మీటింగ్ వుంది అని అభిమానులు అందరికి తెలియచేయటం జరిగింది. అయితే చివర్లో ఈ అభిమానులతో మీటింగ్ కాన్సుల్ అయింది అని వార్తలు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

AlluArjun: అభిమానుల కోసం ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2) సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. వైజాగ్ (Vizag) లో షూటింగ్ జరుగుతోంది, అయితే అల్లు అర్జున్ వైజాగ్ లో ఆదివారం అభిమానులను (Fans meet in Vizag) కలుస్తున్నాడు అని, మీటింగ్ వుంది అని అభిమానులు అందరికి తెలియచేయటం జరిగింది. అయితే చివర్లో ఈ అభిమానులతో మీటింగ్ కాన్సుల్ అయింది అని వార్తలు సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొంతమంది అభిమానులు అయితే కంటతడి పెట్టారు కూడా. ఎక్కడెక్కడ నుండో వచ్చామని, అల్లు అర్జున్ (Allu Arjun) ని చూడలేకపోతున్నందుకు బాధగా ఉందని సాంఘీక మాధ్యమాల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. అభిమానులు కొందరు బోరున ఏడ్చేశారు కూడా.

aa2.jpg

అయితే ఆ వార్తలకు భిన్నంగా అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ (#FansMeetVizag) అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మీట్ కోసం వచ్చి అభిమానులు అందరికీ కనువిందు చేశారు. అభిమానులు చాలామంది ఫోటోస్ కూడా తీసుకున్నారు. వైజాగ్ లో షూటింగ్ లో బిజీగా వున్నా కూడా, అభిమానుల కోరిక మేరకు అల్లు అర్జున్ (#AlluArjun) వచ్చి ఇలా వాళ్ళని పలకరించేసరికి ఆ అభిమానులకి ఆనందం ఆగలేదు. అందులో ఒక అభిమానికి అయితే అల్లు అర్జున్ స్వయంగా దగ్గరికి పిలిచి మరీ ఫోటో తీసుకోమని చెప్పాడు. (#FansMeet) అది అల్లు అర్జున్ అభిమానాలకిచ్చే గౌరవం. అందుకే అభిమానులు అల్లు అర్జున్ ఆర్మీ అని ఒకటి తయారు చేశారు కూడా.

Updated Date - 2023-02-07T14:31:48+05:30 IST