Kiara Advani: నటి వల్ల వ్యాపారవేత్తకి భార్యతో విడాకులు తీసుకునే పరిస్థితి.. వైరల్ అవుతున్న పోస్ట్

ABN , First Publish Date - 2023-02-05T12:34:30+05:30 IST

ప్రస్తుతం బాలీవుడ్‌ మొత్తం కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి గురించే చర్చించుకుంటోంది.

Kiara Advani: నటి వల్ల వ్యాపారవేత్తకి భార్యతో విడాకులు తీసుకునే పరిస్థితి.. వైరల్ అవుతున్న పోస్ట్
Kiara Advani

ప్రస్తుతం బాలీవుడ్‌ మొత్తం కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) పెళ్లి గురించే చర్చించుకుంటోంది. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 6న వివాహబంధంతో ఒకటవ్వబోతున్నారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని ప్రముఖ ప్యాలెస్ వీరి పెళ్లి కోసం ముస్తాబు అవుతోంది. ఈ తరుణంలో కియారా గురించి ప్రముఖ వ్యాపారవేత్త, భారత్ పే కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్‌(Ashneer Grover) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అష్నీర్ స్వయంగా ‘డోగ్లాపన్’ అనే ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. అందులో కియారా అడ్వాణీ వల్ల ఆయన భార్య మాధురితో విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిన సంఘటన గురించి పంచుకున్నాడు. దీనికి సంబంధించిన పిక్‌ని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అందులో.. ‘‘నేను ఓ సారి పని మీద వేరే చోటుకి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో నా భార్య మాధురి నాతో పాటు ఉంది. మమ్మల్ని డ్రాప్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేయడానికి నా స్నేహితుడు వచ్చాడు. ఆ సమయంలో మేమిద్దరం అతని పెళ్లి అడిగాం. అప్పుడు నేను.. నువ్వు పెద్దోడి అయ్యావు. ఏ బాలీవుడ్ స్టార్‌తో పెళ్లి గురించి మాట్లాడుతున్నావని జోక్ చేశా. అనంతరం ఆ రోజు సాయంత్రం నేను వేరే చోటుకి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో మా అమ్మ నా దగ్గరకి వచ్చి ‘నువ్వు చాలా పెద్దోడివి అయిపోయావు. నేను నిన్ను కనీసం చూడలేకపోతున్నాను’ అంది. అది విన్న నాకు నవ్వొచ్చింది. అప్పుడు నేను మా అమ్మతో.. ‘ఈ రోజుల్లో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. నేను ఇప్పుడు గనుక పెళ్లి చేసుకుంటే కియారా అడ్వాణీని చేసుకునేవాడిని’ అని జోక్ చేశా.

అది విన్న మాధురి ముఖం మారిపోయింది. ఆమె బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. అందుకే మేము విమానంలో వెళుతున్నప్పుడు కోపంతో బరస్ట్ అయిపోయింది. ‘నీకు కియారాని పెళ్లి చేసుకోవాలని ఉందా’ అని అరిచింది. నేను జీరోగా ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడింది. దాదాపు అరగంట పాటు నాపై అరిచింది. అంతేకాకుండా.. తన నగలు అన్నింటిని తీసేసి నా చేతిలో వేసింది’’ అని రాసుకొచ్చాడు. ఈ పిక్స్‌ని షేర్ చేసిన నెటిజన్ ‘కియారా అడ్వాణీ, అష్నీర్ గ్రోవర్, ఆయన విడాకులు’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2023-02-05T12:34:53+05:30 IST