SankranthiBoxOffice: వీరయ్య విన్నర్, బాలయ్య రన్నర్

ABN , First Publish Date - 2023-01-16T14:34:00+05:30 IST

సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' నిలిచింది. (Waltair Veerayya declared as Sankranthi Winner) వాల్తేరు వీరయ్య 13వ తేదీన విడుదల అయింది, కాగా మొదటి నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమాలో వీరయ్యగా చిరంజీవి తన పాత చిరంజీవిని ఒకసారి గుర్తు చేసినట్టుగా బాగా నటించటంతో పాటు, సన్నివేశాలు అన్నీ అలా ఉండేలా తీసాడు దర్శకుడు బాబీ కొల్లి.

SankranthiBoxOffice: వీరయ్య విన్నర్, బాలయ్య రన్నర్

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే ఈ సంక్రాంతికి విడుదల అయిన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే చూసారు. అయితే సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' నిలిచింది. (Waltair Veerayya declared as Sankranthi Winner) వాల్తేరు వీరయ్య 13వ తేదీన విడుదల అయింది, కాగా మొదటి నుండే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమాలో వీరయ్యగా చిరంజీవి తన పాత చిరంజీవిని ఒకసారి గుర్తు చేసినట్టుగా బాగా నటించటంతో పాటు, సన్నివేశాలు అన్నీ అలా ఉండేలా తీసాడు దర్శకుడు బాబీ కొల్లి. (Bobby Kolli shown vintage Chiranjeevi in this film and Ravi Teja is an added advantage for this one) అలాగే ఇందులో మరొక స్టార్ రవితేజ నటించటం ఈ సినిమా కి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈరోజు కి కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెపుతున్నారు. (The collections of this film are very strong even today at the Box-Office) ఈ సినిమాలో చిరంజీవి చేసిన చిలిపి సన్నివేశాలు, పాటలు, రవితేజ చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు, ప్రేక్షకుల మనసులను రంజిప చేశాయి. అందుకే ఇది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనడం లో ఎట్టి సందేహం లేదు.

VSR4.jpg

ఇంకా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'వీరసింహ రెడ్డి' (Veerasimha Reddy) కలెక్షన్స్ రెండో రోజు నుండీ బాగా పడిపోయాయి అని అంటున్నారు. (Balakrishna's 'Veerasimha Reddy' falls down from second day) చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' విడుదల రోజు నుండీ ఈ 'వీరసింహా రెడ్డి' కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తోంది. అదీ కాకుండా 'వీరసింహా రెడ్డి' లో విపరీతమయిన హింస చోటుచేసుకోవడం, సినిమా కూడా పెద్దగా అరుపులు కేకలు, నరుక్కోవడాలూ, కొట్టుకోవడాలూ ఉండటంతో ఈ సినిమాకి ఇవన్నీపెద్ద మైనస్ గా తయారయ్యాయి అని అంటున్నారు. (Excess of violence, heads flying, loud music, dialogues are the minus for this film) అదీ కాకుండా పండగ రోజు సరదాగా వుండే సినిమావైపే ప్రేక్షకులు మొగ్గు చూపడం వలన ఈ సినిమా మీదకి దృష్టి ఎక్కువ మరల్చలేదు అని కూడా తెలుస్తోంది. కుటుంబం అందరూ చూసే విధంగా ఈ సినిమా లేదు అని, అందువల్ల ఈ సినిమా రన్నర్ గా మాత్రమే మిగిలింది అని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.

varasudu-new.jpg

ఇంక ఇంకో సినిమా 'వారసుడు' కూడా సంక్రాంతికి విడుదల అయింది. ఈ సినిమా దర్శకుడు, నిర్మాత పైడిపల్లి వంశీ, దిల్ రాజు ఇద్దరూ తెలుగు వాళ్ళు అయినా ఈ సినిమాకి ఎక్కడా ప్రచారం చేయకపోవటం వలన ప్రేక్షకులకి ఈ సినిమా విడుదల అయినట్టుగానే తెలీదు. (Varasudu is a big flop even in Telugu) అలాగే ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ (Tamil Super Star Vijay) నటించినా కూడా, అతను తెలుగు వాళ్ళకి అంతగా పరిచయం లేకపోవటం తో, ఈ సినిమా ప్రభావం ఇసుమంత కూడా లేదు, అందుకని ఇది ఒక పెద్ద ప్లాప్ అయినట్టుగా ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. దిల్ రాజు ఈ సినిమా ప్రచారాలు జయసుధ, శ్రీకాంత్ (Srikanth and Jayasudha) లతో చేయిస్తున్నాడు అంటే, ఈ సినిమా మీద ఎవరికీ కూడా ఇంటరెస్ట్ లేదు అనటానికి ఇదొక ఉదాహరణ. ఇందులో నటించిన కథానాయిక రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా ఈ సినిమా తెలుగు ప్రచారాలకు రాలేదు అంటే ఈ సినిమా నిర్వాహకులకు ఈ సినిమా పోయింది అని ముందే తెలిసినట్టుంది. ఎందుకంటే ఈ సినిమా ఇక్కడ డబ్బింగ్ సినిమాగా విడుదల అయింది, దీనికన్నా ముందే మాతృక అయినా తమిళ సినిమా తమిళ నాట విడుదల అయి అంత పేరు తెచ్చుకో లేకపోయింది. (Though the cinema is directed and produced by Padipalli Vamshi and Dil Raju, both are Telugus, but still there is no impact)

అజిత్ (Ajith Kumar) ఇంకో పెద్ద తమిళ సూపర్ స్టార్. అతని సినిమా తెలుగులో 'తెగింపు' (Thegimpu) గా విడుదల అయింది. ఇది విడుదల అయినా రోజునే ప్లాప్ అని డిక్లేర్ చేసేసారు. (Ajith's film also a big flop) అందుకని ఈ సినిమా గురించి అంతగా ఎవరూ పట్టించుకోలేదు.

ఇంకో చిన్న సినిమా 'కళ్యాణం కమనీయం' (#KalyanamKamaneeyam) కూడా విడుదల అయింది. ఇందులో సంతోష్ శోభన్ (#SantoshSobhan) కథానాయకుడు కాగా, యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ విడుదల చేసింది. రెండు పెద్ద సినిమాల మధ్య ఈ చిన్న సినిమా విడుదల చెయ్యటమే తప్పు, అందులోకి ఈ సినిమాకి థియేటర్స్ కూడా ఏవో మూలాన వున్నవి ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు రెండు పెద్ద సినిమాల మధ్య విడుదల అయిన ఈ చిన్న సినిమాని అస్సలు పట్టించుకోలేదు. ఇది ఎలాగు ఓ.టి.టి. లో వస్తుంది కదా అని దీన్ని థియేటర్ లో చూడకుండా వదిలేశారు. (This small film crushed between two big films)

chiru-new2.jpg

ఈ సంక్రాంతికి మొత్తం మీద చిరంజీవి తన స్టామినా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి, తాను కుర్ర నటులతో సమానంగా పోటీ పడగలను అని మరోసారి నిరూపించారు. మెగాస్టార్ ఈ సంక్రాంతిని మెగా సంక్రాంతిగా మార్చి, సంక్రాంతి కింగ్, విన్నర్ గా నిలిచారు.

Updated Date - 2023-01-16T14:55:53+05:30 IST