Waltair Veerayya 1st Report: జంబలకిడి జారు మిఠాయ.. అన్‌స్టాపబుల్
ABN , First Publish Date - 2023-01-13T08:08:41+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం సంక్రాంతి స్పెషల్ (Sankranthi Special)గా ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 13) భారీ స్థాయిలో
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం సంక్రాంతి స్పెషల్ (Sankranthi Special)గా ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 13) భారీ స్థాయిలో విడుదలైంది. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) (Bobby Kolly) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించగా.. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ఓ కీలక పాత్రలో నటించారు. ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా వంటి భారీ తారాగాణం ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు అన్ని చోట్ల ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఏపీలో కూడా అర్థరాత్రి నుంచే సందడి మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే, ఈ సినిమాకు కూడా ఇంతకు ముందు వచ్చిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)కి ఎలాంటి టాక్ అయితే వచ్చిందో అలాంటి టాకే వినబడుతోంది. ఫ్యాన్స్‌కి మాత్రమే పూనకాలు అని.. సాధారణ ప్రేక్షకులను అంతగా కనెక్ట్ చేసే కొత్తదనం అయితే ఇందులో లేదనేలా టాక్ వస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రిపోర్ట్ ఇలా ఉంది. (Waltair Veerayya First Report)
* ఫస్టాప్ అదిరిపోయింది.. బాస్ ఎంట్రీ సీన్, వింటేజ్ కామెడీ, సాంగ్స్‌లో డ్యాన్స్ స్టెప్స్.. మొత్తంగా ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్.. ఇంటర్వెల్ పూనకాలు లోడింగ్
* ఓ సీన్‌లో అందరినీ ఏడిపించేశావ్ కదా బాబీ అన్నా.. రవితేజ అద్భుతమైన నటన.. దేవిశ్రీ రాంపాండించాడు
* హై ఓల్టేజ్ ఫస్టాఫ్ అనంతరం.. సెకండ్ పార్ట్ రవితేజ ఎంట్రీ, ఆయన చేసే ఎంటర్‌టైన్, ఊహించని క్లైమాక్స్.. అద్భుతంగా ఉన్నాయి.. (Waltair Veerayya Report)
* చిరంజీవి, రవితేజల మధ్య సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, మెగాస్టార్ కామెడీ టైమింగ్ టెర్రిఫిక్. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్. స్మాషింగ్ హిట్. అన్‌స్టాపబుల్ అంతే.
* సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ చాలా బాగుంది. రవితేజ స్ర్కీన్‌ప్రెజెన్స్ ఈ సినిమాకి సోల్. చాలా వరకు లాగ్ అనిపించింది.
* ఫ్లాప్ కంటెంట్.. చిరంజీవి, రవితేజ చాలా వరకు ట్రై చేశారు. కామెడీ కొంతమేర వర్కవుటైంది. ఫ్యాన్స్ ఆకర్షించేలా కొన్ని సన్నివేశాలున్నాయి. డిజప్పాయింట్ చేసింది.. అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. (Waltair Veerayya Social Media Review)
* నో పూనకాలు లోడింగ్.. సినిమా అనుకున్నంతగా లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
* డీసెంట్ యాక్షన్ డ్రామా.. చిరంజీవి అరిపించేశాడు. రవితేజ ఈ సినిమాకి ఎనర్జీ ఇచ్చాడు. దేవిశ్రీ మ్యూజిక్, బీజీఎమ్ డీసెంట్. రొటీన్ స్టోరీ కానీ స్ర్కీన్‌ప్లే ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్ అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.
ప్రస్తుతం నెటిజన్ల నుంచి ‘వాల్తేరు వీరయ్య’పై ఇలాంటి మిక్స్‌డ్ రియాక్షన్ వస్తుంది. (Waltair Veerayya Twitter Review)
ఓవరాల్‌గా అయితే.. వింటేజ్ చిరు- అతని నటన, స్ర్కీన్ ప్రెజన్స్, డ్యాన్స్, కామెడీ టైమింగ్, ఇద్దరి హీరోల ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, పూనకాలు లోడింగ్ సాంగ్, రవితేజ రోల్, ఎమోషనల్ సీన్స్, చిరంజీవి జంబలకిడి జారు మిఠాయ ఇమిటేషన్స్, చిరు-రవితేజల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమా ప్లస్‌లుగా వినిపిస్తుంటే.. (Waltair Veerayya Netizens Reaction)
సెకండాప్ మరీ లెంగ్తీగా ఉండటం, మరీ ముఖ్యంగా లాస్ట్‌లో సాంగ్, క్లైమాక్స్ వీక్‌గా ఉండటం, విఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్‌గా ఉండటంతో పాటు కథ, కథని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఈ సినిమా మైనస్ పాయింట్స్‌గా వినబడుతున్నాయి. సంక్రాంతి పండుగ, ఇద్దరు స్టార్ హీరోలు.. ఫ్యాన్ మూమెంట్స్‌కి లోటు లేదనేలా టాక్ వినబడుతుంది కాబట్టి.. వీరయ్య విన్నర్ అయ్యే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.. ‘వాల్తేరు వీరయ్య’ పూర్తి రివ్యూ మరి కాసేపట్లో.. (Waltair Veerayya Review)