Health Tips: వర్షాకాలంలో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదే.. ఈ సమస్య రాకూడదంటే..

ABN , First Publish Date - 2023-07-30T10:07:26+05:30 IST

జలుబు, జ్వరం నుండి కండరాల సమస్యల వరకు అన్నింటికీ ఇదొక్కటే కారణం దీన్ని అధిగమించాలంటే..

Health Tips:  వర్షాకాలంలో అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఇదే..  ఈ సమస్య రాకూడదంటే..

వర్షాకాలం(monsoon) వచ్చిందంటే చాలు.. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఎండలు సరిగా లేక ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి ఈ వర్షాకాలంలో చాలామంది బట్టలు ఆరబెట్టుకోవడం గురించే ఆలోచిస్తుంటారు కానీ ఎండలేకపోతే అందరికీ అతిపెద్ద సమస్య ఎదురవుతుంది. అదే విటమిన్-డి లోపం(vitamin-D deficiency). విటమిన్-డి లోపం కారణంగా శరీరంలో కాల్షియం స్థాయిలు ప్రశ్నార్థకమవుతాయి. ఎముకలు బలహీనం అవుతాయి. ఫ్లూ, డయాబెటిస్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కండరాల తిమ్మిర్లు, కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరం క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ఫెయిల్ అవుతుంది. కేవలం విటమిన్-డి లోపం కారణంగా ఇన్ని సమస్యలు వస్తాయి.ఇవేవీ రాకుండా ఉండాలంటే సూర్యరశ్మి ద్వారా ఇన్నాళ్లు అప్పనంగా పొందిన విటమిన్-డి ని ఆహారాల నుండి పొందాల్సి ఉంటుంది. విటమిన్-డి లభించే ఆహారాలేంటో తెలుసుకుంటే..

ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు(Milk) తాగితే ఎముకలు బలంగా మారతాయని అంటారు. అయితే కేవలం కాల్షియం మాత్రమే కాదు. విటమిన్-డి కూడా పాలు తాగడం వల్ల లభిస్తుంది. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ పాలు తాగడం అలవాటు చేసుకుంటే చాలావరకు విటమిన్-డి ని భర్తీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా పసుపు కలిపిన పాలు, లేదా అల్లం పాలు వంటివి రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

చేపలలో(Fish) విటమిన్-డి పుష్కలంగా ఉంటుందని తెలిసిందే. మాంసాహారులకు ఇది మంచి ప్రత్యామ్నాయం కూడా. అయితే చేపలతోపాటు సముద్రంలో లభించే గుల్లలు(gulls) కూడా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కేవలం విటమిన్-డి మాత్రమే కాదు.. విటమిన్-బి12(vitamin-B12) లోపం కూడా తీరిపోతుంది.

Fridge: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. కొత్త ప్రిడ్జ్ కొనాల్సిందే.. ఫ్రిడ్జ్ పాడయిపోయిందని ఎలా గుర్తు పట్టాలంటే..!



సిట్రస్ పండ్లైన నారింజలో(Orange) విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అయితే నారింజ జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్-డి కూడా భర్తీ అవుతుంది. నారింజ రసం ఎముకలను బలోపేతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

గుడ్లలో(eggs) ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో గుడ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. చాలామంది గుడ్లలో పచ్చసొనను పక్కన పెట్టి కేవలం తెల్లని భాగాన్ని(egg whites) మాత్రమే తింటుంటారు. కానీ గుడ్డులో పచ్చ సొన(egg yolk) వర్షాకాలంలో తప్పని సరిగా తినడం ఎంతో అవసరం. ఎందుకంటే పచ్చ సొన తినడం ద్వారా విటమిన్-డి పొందవచ్చు.

వర్షాకాలంలో సమృద్దిగా లభ్యమయ్యే ఆహారాలలో పుట్టగొడుగులు(mushroom) కూడా ఒకటి. పుట్టగొడుగులు మంచి పోషకాహారంగా పరిగణించబడతాయి. ఇది శాఖాహారులు కూడా తినదగిన ఆహారం. ఇప్పట్లో పుట్టగొడుగులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే వీటి ప్యాకేజీ, పోషకవిలువలు చూసుకుని కొనుగోలు చేయాలి. సరైన పుట్టగొడుగులు విటమిన్-డి ని శరీరానికి సమృద్దిగా అందిస్తాయి.

Marriage: పెళ్లయిందన్న ఆనందం పట్టుమని 10 రోజులు కూడా లేదుగా.. పుట్టింటికని చెప్పి వెళ్లిన భార్య చేసిన నిర్వాకంతో..!


Updated Date - 2023-07-30T10:30:12+05:30 IST