Samyukta: ఒక సినిమా చేసి ఆపేద్దాం అనుకున్నాను
ABN , First Publish Date - 2023-02-13T13:36:44+05:30 IST
మలయాళం నటి అయిన సంయుక్తకి అసలు నటన మీద ఆసక్తి లేదని ఒక ఆశ్చర్యకర విషయం చెప్పింది. ఎందుకంటే కాలేజీ లో వున్నప్పుడే ఆలా వెకేషన్ ని వెళ్లినట్టుగా ఒక సినిమా చేసిందిట. అది సరిగ్గా చెయ్యలేదుట కూడా. నటించటం, సినిమాలు చెయ్యటం తన వల్ల కాదు అని మళ్ళీ కాలేజీ లో చదువుకోటవటానికి వెళ్లిపోయిందట.
సంయుక్త మీనన్ (Samyukta Menon) లో మీనన్ పేరు తీసేసి ఒక్క సంయుక్త (Samyukta) అని పిలిపించుకోవటమే తనకి ఇష్టం అని చెప్పింది 'సార్' (Sir) లో ధనుష్ (Dhanush) పక్కన నటిస్తున్న సంయుక్త. ఎందుకంటే అది ఉంటే నేను ఎక్కడ నుంచి వచ్చాను, ఎవరిని, అదీ కాకుండా అది ఉంటే నన్ను నేను మిగతా వాళ్ళతో వేరు చేసుకుంటున్నట్టుగా వుంది. అందుకని అది తీసేసా, ఒక హ్యూమన్ గా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది సంయుక్త.
మలయాళం నటి అయిన సంయుక్తకి అసలు నటన మీద ఆసక్తి లేదని ఒక ఆశ్చర్యకర విషయం చెప్పింది. ఎందుకంటే కాలేజీ లో వున్నప్పుడే ఆలా వెకేషన్ ని వెళ్లినట్టుగా ఒక సినిమా చేసిందిట. అది సరిగ్గా చెయ్యలేదుట కూడా. నటించటం, సినిమాలు చెయ్యటం తన వల్ల కాదు అని మళ్ళీ కాలేజీ లో చదువుకోటవటానికి వెళ్లిపోయిందట.
ఆ తరువాత మళ్ళీ ఇంకో ఆఫర్ వచ్చిందట. విధిని ఎవరూ ఆపలేరు కదా అని వేదంతం కూడా మాట్లాడుతోంది. అందుకే రెండో సినిమాకి మళ్ళీ బాగా పనిచేసి అసలు సినిమా ఎలా తీస్తారు, ఎంతమంది పని చేస్తారు, నటన అంటే ఏంటి, ఇలా ఆ సినిమా గురించి బాగా అధ్యయనం చేసాక, సినిమా అంటే అప్పుడు ప్రేమ మొదలయింది అని చెప్తోంది.
అయితే అప్పుడు కూడా ఒక్క మంచి సినిమా చేసి సినిమాలు చెయ్యడం ఆపేద్దాం అని అనుకున్నా అని చెప్తోంది. కానీ నటన మీద ప్రేమ పెరిగి ఆలా సినిమాల్లో కంటిన్యూ చేశా అని చెప్పింది. తెలుగులో మొదటిసారిగా 'బీమ్లా నాయక్' చేసింది. ఇది మలయాళం సినిమా 'అయ్యప్పన్ కోషియన్' కి రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కథానాయకులు. మలయాళం లో చేసిన పాత్ర అలాగే చేస్తే చెయ్యకూడదు అని అనుకుందిట. కానీ వాళ్ళు ఆ పాత్రని తెలుగులో చాలా మార్పులు చేసాం, బాగుంటుంది అని చెప్తే అప్పుడు వొప్పుకుందిట ఆ సినిమా. అలాగే పవన్ (Pawan Kalyan) గారి అభిమానులు కూడా ఆమెని బాగా సపోర్ట్ చేసారు అని చెప్తోంది.
అప్పుడే 'బింబి సారా' (Bimbisara), 'విరూపాక్ష' (Virupaksha) సినిమాలు కూడా ఒప్పుకుంది. అప్పటికి ఇంకా తెలుగు సరిగ్గా రాదట. 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) సినిమా కి అని పిలిపించి అక్కడ టీం అందరూ ఎదో చర్చ మొదలెట్టారట. సంయుక్త కి తెలుగు రాదు కాబట్టి, అవేమి అర్థం కావటం లేదు కానీ, తను నచ్చలేదేమో వెళ్ళిపోమంటారేమో అని అనుకుందట. కానీ వాళ్ళ చర్చల్లో ధనుష్ (Dhanush) అనే పేరు బాగా వినపడిందిట. ఆ తరువాత తెలిసిందిట ఆమెకి వాళ్ళు ధనుష్ సినిమా 'సార్' కోసం కూడా తనని తీసుకుందామని మాట్లాడుకున్నారని. అప్పుడే వెంకీ అట్లూరి ని కూడా పిలిపించి లుక్ టెస్ట్ చేయింది 'సార్' కి కూడా తీసుకున్నారు అని చెప్తోంది సంయుక్త.
ధనుష్ సినిమాలని ఆమె కాలేజీ రోజుల నుండి చూస్తూ ఉందిట. అతనికి తను పెద్ద అభిమానిని కూడా అని చెప్తోంది సంయుక్త. ధనుష్ సార్ ఇప్పుడు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు, హాలీవుడ్ లో కూడా చేసారు, అతని మంచి నటుడు, అలంటి అతని పక్కన చెయ్యడం నిజంగా అదృష్టమే అని చెప్తోంది సంయుక్త.
ఎలాంటి ప్రిపరేషన్ చేస్తారు సినిమాలో నటించడానికి అంటే, ప్రతి పాత్రని అవగాహనా చేసుకొని, అర్థం చేసుకొని నటిస్తా అని చెప్తోంది సంయుక్త. ఒక్కో పాత్రకి ఒక్కో విధానంగా వెళతా, కానీ స్పాంటేనియస్ గా చెయ్యడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అంటోంది. అదీ కాకుండా ఆ పాత్రని దర్శకుడు, రచయితే ఆలోచనలోంచి వస్తుంది కాబట్టి, వాళ్ళతో ఎక్కువ కాలం ఆ పాత్ర గురించి మాట్లాడి వాళ్ళు అనుకునే విధంగా చెయ్యడానికి చూసినప్పుడే బెస్ట్ యాక్టింగ్ వస్తుంది అని చెపుతుంది.
ఒక్కో పాత్ర ఒక్కోలా ఉంటుంది. 'విరూపాక్ష' సినిమాలో కొంచెం గ్రామీణ ప్రాంతానికి చెందిన నేపధ్యం ఉంటుంది. నేను హైదరాబాద్ లో ఉంటున్నా కదా అందుకని తెలంగాణ, ఆంధ్ర లో కొన్ని గ్రామాలని సందర్శించి గ్రామాలూ ఎలా వుంటాయో తెలుసుకున్నాను అని చెప్తోంది. 'సార్' సినిమాలో ఉపాధ్యాయిని రోల్ కాబట్టి, తాను చదివినప్పుడు ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలాంటి బట్టలు కట్టుకొని వచ్చేవారు, వాళ్ళు ఎలా మాట్లాడేవారు, వాళ్ళ హావభావాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్న అని చెప్తోంది సంయుక్త.
రేపు 'వాలెంటైన్స్ డే' కదా మరి ఏమి చేస్తున్నారు అంటే, పెద్దగా నవ్వి 'నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు, మరి ఎలా' అని అంటోంది. షూటింగ్ చేస్తానేమో అని చెప్తోంది. ప్రేమ అంటే ఇప్పుడు అందరూ బాయ్ ఫ్రెండ్ గురించే అని అనుకుంటున్నారు అని అది కాదు అని, ప్రేమ అంటే, అమ్మ, నాన్నల మీద, పని మీద, ఇలా ఇంకా చాలా వాటిని ప్రేమించవచ్చు, అది అసలు ప్రేమ. కానీ బాయ్ ఫ్రెండ్ గురించి అడిగేటప్పుడు ప్రేమ అని అనొద్దు, అది ప్రేమ కాదు, అది రొమాంటిక్ జీవితం కిందకి వస్తుంది అని చెప్తోంది సంయుక్త.
-- సురేష్ కవిరాయని