Kabir Khan: స్క్రిఫ్ట్‌లో నటులు జోక్యం చేసుకోకపోతే భయమేస్తుందంటున్న డైరెక్టర్
ABN , First Publish Date - 2023-02-06T17:16:06+05:30 IST
బాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు కబీర్ ఖాన్ (Kabir Khan). ‘ఏక్ థా టైగర్’ (Ek Tha Tiger), ‘బజరంగీ భాయిజాన్’ (Bajrangi Bhaijaan) వంటి చిత్రాలతో సత్తాను చాటారు.
బాలీవుడ్‌లో యాక్షన్ చిత్రాలతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు కబీర్ ఖాన్ (Kabir Khan). ‘ఏక్ థా టైగర్’ (Ek Tha Tiger), ‘బజరంగీ భాయిజాన్’ (Bajrangi Bhaijaan) వంటి చిత్రాలతో సత్తాను చాటారు. తాజాగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా స్క్రిఫ్ట్‌లో నటులు, అసిస్టెంట్ డైరెక్టర్స్ జోక్యం చేసుకోకపోతే భయమేస్తుందని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
డైరెక్టర్ ఏది చెబితే నటులు అది చేయాలని అందరు భావిస్తుంటారు. కానీ, కొంత మంది డైరెక్టర్స్ మాత్రం అలా కాదు. మూవీ స్క్రిఫ్ట్‌లో నటులు, అసిస్టెంట్స్ మార్పులు, చేర్పులు సూచించకపోతే భయపడుతుంటారు. ఆ కోవకు చెందిన డైరెక్టరే కబీర్ ఖాన్. ‘‘స్క్రిఫ్ట్‌లో నటులు జోక్యం చేసుకుంటున్నారని చాలా మంది చెబుతుంటారు. నిజం చెప్పాలంటే నా స్క్రిఫ్ట్‌లో నటులు జోక్యం చేసుకోకపోతే నాకు భయమేస్తుంది. ఆ వ్యక్తి క్రియేటివ్‌గా ఆలోచించడం లేదని, ఆసక్తి లేదని నాకనిపిస్తుంది. నేను చెప్పింది మాత్రమే చేసే నటులు, క్రియేటివ్‌గా లేని వారితో పనిచేయడం నాకిష్టం ఉండదు. నటులు మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో సహా ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చిన నేను తీసుకుంటాను. క్రియేటివ్ ఫీల్డ్‌లో పనిచేసే వ్యక్తులు అందరికీ అందుబాటులో ఉండాలి. అటువంటి సమయంలో మాత్రమే ఇతరులు వచ్చి సలహాలు ఇస్తారు’’ అని కబీర్ ఖాన్ చెప్పారు. ఇక కబీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘83’ కు దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణంగా పరాజయం పాలైంది. ప్రస్తుతం యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) తో సినిమా చేస్తున్నారు.