Viral Video: ఇదేక్కడి వింత ఆచారంరా బాబోయ్.. హోలీ పేరిట మగాళ్ల తాట తీస్తున్నారుగా..!
ABN , First Publish Date - 2023-03-02T14:01:17+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా పాటించే ఓ వింత ఆచారం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Viral Video: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా పాటించే ఓ వింత ఆచారం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 'లత్మార్ హోలీ' (Lathmar Holi) పేరిట ఈ నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం కూసింత వెరైటీగానే ఉంటుంది. దీనిలో భాగంగా మగాళ్లను ఆడవాళ్లు కర్రలతో కొడతారు. అప్పుడు మగవారు ఆ దెబ్బల నుంచి తప్పించుకోవాలి. ఇది తరతరాలుగా హోలీ సందర్భంగా యూపీలోని చాలా చోట్ల ప్రజలు పాటిస్తున్న ఆచారం. ఇక ప్రతియేటా హోలీ వేడుకలను యూపీలో ఏకంగా 25 రోజులు జరుపుకుంటారనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం బర్సానాలో లత్మార్ హోలీ జరిగింది.
కృష్ణుడిపై (Lord Krishna) రాధకు ఉన్న ప్రేమకు చిహ్నంగా జరపుకునే ఈ 'లత్మార్ హోలీ'లో ఆడవాళ్లు సరదాగా మగవారిని కర్రలతో కొడతారన్నమాట. ఆ సమయంలో మగవారు వివిధ వస్తువులను అడ్డుపెట్టుకుని తమను తాము కాపాడుకోవాలి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇంకేందుకు ఆలస్యం యూపీలో కూసింత వెరైటీగా నిర్వహించే 'లత్మార్ హోలీ' వేడుకులపై మీరు ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి: ప్రియురాలంటూ ఓ వ్యక్తి బ్యాగులో ఏం వేసుకుని తిరుగుతున్నాడో తెలిసి కంగుతిన్న పోలీసులు.. చివరిలో ట్విస్ట్ ఏంటో తెలిస్తే..