గోనె సంచి మూటతో పగలంతా తిరిగిన వ్యక్తి.. చివరకు కాలువ పక్కన ఉండగా.. స్థానికులు వెళ్లి తెరచి చూడగా..

ABN , First Publish Date - 2023-02-12T15:59:51+05:30 IST

ఓ వ్యక్తి గోనె సంచి మూటను భుజాన వేసుకుని పగలంతా తిరిగాడు. చివరకు సాయంత్రం ఓ కాలువ వద్ద ఉన్న మూటను స్థానికులు గుర్తించారు. భయం భయంగానే వెళ్లి తెరచి చూసి.. చివరకు షాక్ అయ్యారు...

గోనె సంచి మూటతో పగలంతా తిరిగిన వ్యక్తి.. చివరకు కాలువ పక్కన ఉండగా.. స్థానికులు వెళ్లి తెరచి చూడగా..

కొన్నిసార్లు అనుమానాస్పద స్థితిలో కనిపించే వస్తువులు.. ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. చివరకు ఆరా తీస్తే వాటి వెనుక పెద్ద నేర చరిత్రే ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గోనె సంచి మూటను భుజాన వేసుకుని పగలంతా తిరిగాడు. చివరకు సాయంత్రం ఓ కాలువ వద్ద ఉన్న మూటను స్థానికులు గుర్తించారు. భయం భయంగానే వెళ్లి తెరచి చూసి.. చివరకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మీరట్ పరిధి ఖర్ఖోడాకు సమీపంలోని జమున నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాలువ వద్ద గోనె సంచి మూట ఉండడాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. ముందుగా దాని వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ వార్త తెలియగానే చుట్టు పక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. చివరకు కొందరు ధైర్యం చేసి సంచిని తెరచి చూశారు. లోపల ఓ మహిళ మృతదేహం (woman dead body) నగ్నంగా ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు. భయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Viral Video: కాల్చబోతుంటే.. తుపాకీకే ఎదురు నిలిచిన జింక.. దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే..

young-women.jpg

మృతురాలికి సుమారు 30ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. చివరకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించగా షాకింగ్ దృశ్యాలు బయటపడ్డాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి.. గోనె సంచి మూటను బుజాన వేసుకుని పగలంతా వీధులన్నీ తిరిగినట్లు గుర్తించారు. చాలా సార్లు మూటను దాచేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. కానీ వీలు కాక.. చాలా సేపు సరైన స్థలంలోకి తిరిగాడు. చివరకు జమున నగర్‌లోని గ్యాస్ గోడౌన్ (Gas godown) సమీపంలోని కాలువ వద్ద పడేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-02-12T16:05:45+05:30 IST