Share News

Marriage: సారీ.. నా కూతురికి ఇప్పుడే పెళ్లి చేయను.. ఈ ఒక్క మాట చెప్పాక ఆ తల్లి ప్రాణాలతో లేదు.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-11-13T13:16:27+05:30 IST

"మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చెయ్యను" అని ఎంతో మర్యాదగా చెప్పినా సరే ఆ తల్లి ప్రాణాలు నిలవలేదు.

Marriage: సారీ.. నా కూతురికి ఇప్పుడే పెళ్లి చేయను.. ఈ ఒక్క మాట చెప్పాక ఆ తల్లి ప్రాణాలతో లేదు.. అసలేం జరిగిందంటే..!

పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించినంతగా ఇంకెవరూ ఆలోచించరు. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. పాపం ఆ తల్లి కూడా తన కూతురు విషయంలో అలాగే ఆలోచించింది. ఓ కుటుంబం ఆమె ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మీ అమ్మాయిని ఆ ఇంటి కోడల్ని చేయండి అని అడిగితే సున్నితంగా కాదని చెప్పేసింది. కానీ ఆ ఒక్కమాట ఆమె ప్రాణం తీసింది. అక్కడ ఎలాంటి గొడవ జరగకపోయినా ఇంత దారుణం చోటుచేసుకోవడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

చండీగఢ్(Chandigarh) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చండీగఢ్ , అమృత్ సర్ లోని బాబా బకాలా సబ్ డివిజన్ పరిధిలో పథియాలా అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పరంజిత్ కౌర్ అనే 55ఏళ్ల మహిళ(55 Years women) నివసిస్తోంది. ఈమెకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. అదే గ్రామానికి చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి శనివారం ఉదయం 11గంటల సమయంలో తన బంధువులతో కలసి పరంజిత్ ఇంటికి వెళ్లాడు. "మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి" అని అడిగాడు. ఆ మాటలు వినగానే పరంజిత్ మొదట విస్తుపోయింది. ఆ తరువాత గురుప్రీత్ సింగ్ తో "సారీ.. మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చెయ్యను, మీరు ఇక్కడినుండి వెళ్లిపోండి' అని చెప్పింది. ఆ మాట వినగానే గురుప్రీత్ సింగ్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే అతని దగ్గరున్న లైసెన్స్ లేని తుపాకీతో(Unlicensed pistol) పరంజిత్ ను కాల్చాడు. రెండుసార్లు కాల్చిన తరువాత అక్కడి నుండి పారిపోయాడు.

ఇది కూడా చదవండి: Viral Video: చిన్న పామే కదా అని తోకపట్టుకుని గదిలోంచి లాగబోయాడు.. మరుక్షణంలోనే జరిగిన సీన్‌తో పరుగో పరుగు..!



గురుప్రీత్, పరంజిత్ ను కాల్చిన తరువాత పరంజిత్ కుటుంబ సభ్యులు ఆమెను బాబా బకాలా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూనే పరంజిత్ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు పరంజిత్ కుమార్తెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడని, పరంజిత్ అతని ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నందుకే కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గురుప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Dry Fruits: డయాబెటిస్ ఉందా..? ఈ 8 డ్రైఫ్రూట్స్‌ ఎంత హెల్ప్ చేస్తాయంటే..!

Updated Date - 2023-11-13T13:16:28+05:30 IST