Muslim couple remarrying: ఆ జంటకు ‘లింగ వివక్ష’ అంటే అస్సలు పడదు... పెళ్లయిన 30 ఏళ్ల తరువాత వారు చేయబోతున్న పని ఎంత ఆదర్శనీయమంటే...
ABN , First Publish Date - 2023-03-07T11:27:04+05:30 IST
కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఒక ముస్లిం జంట(Muslim couple) తమకు వివాహమైన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోమారు తిరిగి వివాహం(remarrying) చేసుకోబోతోంది.
కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఒక ముస్లిం జంట(Muslim couple) తమకు వివాహమైన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోమారు తిరిగి వివాహం(remarrying) చేసుకోబోతోంది. కుమార్తెల వారసత్వ ఆస్తి హక్కుRight to heritage property of daughters)కు సంబంధించి ఎదురవుతున్న లింగ వివక్ష(Gender discrimination)కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో భాగంగా వీరు మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
న్యాయవాది, హక్కుల కార్యకర్త సి షుకూర్(C Shukur), కన్నూర్ యూనివర్శిటీ న్యాయ విభాగపు హెడ్, అతని భార్య షీనా షుకూర్ వారి పునర్వివాహం(remarrying) కోసం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముహూర్తంగా ఎంచుకున్నారు. వీరు ముస్లిం సంప్రదాయం ప్రకారం 1994 అక్టోబర్ 6 న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముస్లిం పర్సనల్ లా(Muslim Personal Law) (షరియత్) ప్రకారం వారసత్వంగా వచ్చే ఆస్తిలో కుమార్తెలు మూడింట రెండు వంతుల హక్కును మాత్రమే కలిగి ఉంటారు. మిగిలినది వారి సోదరులకు చెందుతుంది. ఈ అసమానతలను నిరసిస్తూ ఈ దంపతులు తమ వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం(Special Marriage Act) కింద నమోదు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
తద్వారా భారతీయ వారసత్వ చట్టం ప్రకారం కుమార్తెలకు వారసత్వ సంపదపై సమాన హక్కులు ఉంటాయి. ఈ సందర్భంగా షుకూర్ మాట్లాడుతూ భవిష్యత్తు(future)లో సోదరులు వారి సోదరీమణుల ఆస్తిలో వాటా క్లెయిమ్ చేస్తారనే ఆందోళన ఇక ఉండబోదన్నారు. తాము చాలా కాలంగా ఈ లింగ అసమానతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని, తమ పునర్వివాహం ఈ ప్రచారంలో భాగం అని అన్నారు. కాగా ఈ తరహాలో ఇది తొలి ఉదంతమేమీ కాదు. ముస్లిం కమ్యూనిటీ(Muslim community)కి చెందిన న్యాయమూర్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా తమ కుమార్తెల సంపదపై సమాన హక్కులను కాపాడేందుకు ప్రత్యేక వివాహ చట్టం కింద పునర్వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రత్యేక వివాహ చట్టం(Special Marriage Act) అమలులోకి వచ్చింది.
గతంలో ఉన్న హనాఫీ వారసత్వ చట్టాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు పేర్కొంటున్నారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలు, హనాఫీ వారసత్వ చట్టాలలో అవసరమైన సవరణలు చేయాలని వారు కోరుతున్నారు. ముస్లిం మహిళల హక్కుల(Muslim women's rights) కోసం వివిధ ఫోరమ్‌లు పలు పోరాటాలు సాగిస్తున్నాయి. దీనికి సంబంధించిన పలు పిటిషన్లు కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి.