Viral Video: చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఇదేం నిర్వాకం.. పెళ్లి పేరుతో వింత చేష్టలు.. విద్యార్థులపై మండి పడుతున్న నెటిజన్లు..!
ABN , First Publish Date - 2023-04-01T16:13:35+05:30 IST
ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు వింత వింత పోకడలకు పోతూ చివరికి జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూ ఉన్నాం. కొందరు చదువును పక్కన పెట్టి జల్సాలకు అలవాటుపడుతుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో..
ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు వింత వింత పోకడలకు పోతూ చివరికి జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూ ఉన్నాం. కొందరు చదువును పక్కన పెట్టి జల్సాలకు అలవాటుపడుతుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులు చేసి చివరకు అందరి ముందూ నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన విద్యార్థులు.. పెళ్లి పేరుతో చేసిన చేష్టలు చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీకి (University of Delhi) చెందిన శివాజీ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులు.. అందుకు విరుద్ధంగా పెళ్లి (marriage) పేరుతో హంగామా చేశారు. ఓ యువతి (young woman) పెళ్లికుమార్తెలాగా, మరో యువకుడు (young man) పెళ్లికుమారుడిలాగా మారిపోయారు. మిగతా విద్యార్థులంతా (students) రెండు గ్రూపులుగా విడిపోయి అతిథుల పాత్ర పోషించారు. పెళ్లి ఊరేగింపు, దండలు మార్చుకోవడం, డీజే పాటలకు డాన్సులు.. ఇలా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చేసి చూపించారు. వధువును చూసి షాకై వరుడు కింద పడిపోతాడు. మరోవైపు పక్కనే ఉన్న విద్యార్థులంతా ఈలలు కేకలతో గోలగోల చేస్తుంటారు. వధూవరుల పాత్ర పోషించిన ఇద్దరూ దండలు మార్చుకున్న అనంతరం అందరితో కలిసి డాన్సు వేస్తారు.
యువతులు కూడా యువకులతో కలిసి పోటాపోటీగా డాన్సులు వేస్తూ ఉంటారు. ఈ ఘటన మొత్తం కళాశాలలోనే జరుగుతున్నా... ఎవరూ వారించకపోవడం విశేషం. అలాగే పాకిస్తాన్ (Pakistan) లాహోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ కళాశాలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రస్తుతం ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం దారుణం.. అంటూ కొందరు, సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదు.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.