తమ్ముడి గదిలో కనిపించిన మాత్రలు.. అవేంటా అని గూగుల్‌లో సెర్చ్ చేసిన అక్కకు షాక్.. ఇదేం పని అని నిలదీస్తే అతడు చెప్పింది విని..

ABN , First Publish Date - 2023-03-03T13:56:06+05:30 IST

తండ్రి నిలదీస్తే.. ఆ కుర్రాడు చెప్పింది విని వారికి మతిపోయినంతపనయింది..

తమ్ముడి గదిలో కనిపించిన మాత్రలు.. అవేంటా అని గూగుల్‌లో సెర్చ్ చేసిన అక్కకు షాక్.. ఇదేం పని అని నిలదీస్తే అతడు చెప్పింది విని..

ఎందరో దేవుళ్లకు మొక్కుకుంటే గానీ ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లల తరువాత ఓ కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచారు. ఒక్కగానొక్క కొడుకు కదా అని అడిగిందల్లా ఇచ్చారు. కాలేజీకి వెళ్తోంటే ఏ లోటూ ఉండకూడదని బైకును కూడా కొనిచ్చారు. కానీ ఓరోజు అతడి గదిని ఓ అక్క శుభ్రం చేస్తోంటే ఏవో మాత్రలు కనిపించాయి. అవేంటా అని గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తే వచ్చిన సమాధానం తెలిసి కంగుతింది.. వెంటనే విషయాన్ని తండ్రికి చెప్పింది.. తండ్రి కూడా ఇదేం పనంటూ నిలదీస్తే.. ఆ కుర్రాడు చెప్పింది విని వారికి మతిపోయినంతపనయింది.. గత జన్మలోని ప్రియుడి కోసమే అమ్మాయిలా మారాలి అనుకుంటున్నాంటూ అతడు తేల్చిచెప్పడంతో అంతా అవాక్కయ్యారు.. మద్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం భోపాల్(Bhopal) లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.19ఏళ్ళ కుర్రాడు స్థానిక కాలేజిలో బిఈ మొదటి సెమిస్టర్(B.E First Semister) చదువుతున్నాడు. ఇతను తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లల తరువాత పుట్టాడు. దీంతో తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. నలుగురు అక్కలు కూడా ఈ ముద్దుల తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. గది శుభ్రం చేస్తున్న కుర్రాడి అక్కకు గదిలో టాబ్లెట్స్ బాటిల్ దొరికింది. ఆమె దానిగురించి గూగుల్లో సెర్చ్ చేసి షాకయ్యింది. అబ్బాయిలలో అమ్మాయిల లక్షణాలు డవలప్ కావడానికి ఉపయోగించే టాబ్లెట్స్ తమ్ముడి గదిలో ఎందుకున్నాయో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే తండ్రికి చెప్పగా, తండ్రి ఆ కుర్రాడిని నిలదీశాడు. అబ్బాయి చదువుతున్న కాలేజిలో ఓ కుర్రాడు ఉన్నాడని, తామిద్దరూ ప్రేమించుకుంటున్నామని ఆ కుర్రాడు తండ్రికి సమాధానం ఇచ్చాడు. కొడుకు సమాధానం విని తండ్రి షాకయ్యాడు. 'అబ్బాయిల మధ్య ప్రేమ ఏంటి?' అంటూ ఫైర్ అయ్యాడు. అయితే ఆ కుర్రాడి సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతన్ని ప్రేమిస్తున్న కుర్రాడు ఇతడిని అమ్మాయిలా భావిస్తున్నాడు. వీళ్ళిద్దరూ గతజన్మలో ప్రేమికులని వీరు నమ్ముతున్నారు. ఈ అబ్బాయి గత జన్మలో అమ్మాయని అందుకే ఇతడిని అమ్మాయిగా మార్చుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు. ఈ కుర్రాడిని ప్రేమిస్తున్న వ్యక్తి ఇతని కోసం ఏమైనా చేస్తానని, ఎంతవరకైనా వెళతానని అంటున్నాడు. అతను అనుకున్నట్టు తను ప్రేమించిన అబ్బాయిని అమ్మాయిగా మార్చుకోవడానికి ఏకంగా హార్మోన్స్ మార్పుకోసం మందుల గురించి తెలుసుకుని వాటిని వాడించడం మొదలుపెట్టాడు.ఆ టాబ్లెట్సే అబ్బాయి గదిలో దొరికాయి. దీనికోసం ఇప్పటి వరకు 80వేల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలిసింది. కాగా వీరిద్దరి గతజన్మ కథ విని వీరి తల్లిదండ్రులు షాకయ్యారు. ఈ విషయం రెండు కుటుంబాలలో చాలా గందరగోళం సృష్టించింది.

Read also: State Bank of India: ఈకారణం వల్ల మీ SBI సేవింగ్స్ అకౌంట్ లో డబ్బు కట్ అవుతుంది.. తెలుసుకోకుంటే నష్టపోతారు


హార్మోన్స్ మార్పు కోసం మందులు వాడుతున్న కుర్రాడి తండ్రి ఈ విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. ప్రేమ పేరుతో తమ కొడుకును ఇలా మార్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కొడుకును అమ్మాయిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న కుర్రాడి పైనా, ఆ కుర్రాడి కుటుంబం పైనా కేసు పెట్టాలనుకుంటున్నాడు.జిల్లా కోర్టులో అప్పీలు చేసేందుకు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. ఈయన తన కొడుకుకు చాలా సార్లు ఎంతో ఓపికగా చెప్పి చూశాడట. కానీ తన కొడుకు పూర్తిగా కుర్రాడి మాయలో పడిపోయాడని అమ్మాయిగా మారాలనుకుంటున్న అబ్బాయి తండ్రి చెప్పుకొచ్చాడు. 'అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, అందుకే నేను అమ్మాయిగా మారాలనుకుంటున్నాను' అని చెబుతున్నాడట.ఈ కుర్రాళ్ళను ఇద్దరినీ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి మరీ కౌన్సిలింగ్ ఇప్పించారు కానీ కుర్రాళ్ళలో ఎలాంటి మార్పు లేదు.

Updated Date - 2023-03-03T13:56:06+05:30 IST