Snake treatment: పశు వైద్యశాలలో పాముకు చికిత్స
ABN , First Publish Date - 2023-02-14T11:14:26+05:30 IST
గాయపడిన పాము(Snake)కు పశు వైద్యశాలలో చికిత్స అందించారు. మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపంలోని వైదీశ్వర ఆలయ ప్రాంతానికి
పెరంబూర్(చెన్నై), ఫిబ్రవరి 13: గాయపడిన పాము(Snake)కు పశు వైద్యశాలలో చికిత్స అందించారు. మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపంలోని వైదీశ్వర ఆలయ ప్రాంతానికి చెందిన కృతిక ఇంటి నిర్మాణం పనుల కోసం గుంతలు తవ్వుతున్న సమయంలో పాము బయటకు రావడం చూసి దిగ్ర్భాంతి చెందింది. సమాచారం అందుకున్న శీర్గాళికి చెందిన పాండ్యన్ అక్కడకు చేరుకొని పామును బంధించిన సమయంలో, గుంత తవ్వుతున్న సమయంలో గడ్డపార తగిలి పాముకు గాయమైనట్లు గుర్తించాడు. అటవీ అధికారుల అనుమతితో పశు వైద్యశాలకు తరలించి పాముకు చికిత్స అనంతరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.