Money: జేబులో రూ.లక్ష పెట్టుకుని.. ఆటోలో ఇద్దరు మహిళల మధ్యలో కూర్చున్న వృద్ధుడికి ఊహించని షాక్.. అతడు అడిగిన ఒక్క ప్రశ్నతో..
ABN , First Publish Date - 2023-04-18T18:32:46+05:30 IST
ఓ పెద్దాయన తన సోదరి (Sister) ఇంట్లో పెళ్లి ఉండడంతో బ్యాంకు నుంచి రూ.1లక్ష డ్రా చేసుకుని ఆటోరిక్షా (Auto Rickshaw) ఎక్కాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ పెద్దాయన తన సోదరి (Sister) ఇంట్లో పెళ్లి ఉండడంతో బ్యాంకు నుంచి రూ.1లక్ష డ్రా చేసుకుని ఆటోరిక్షా (Auto Rickshaw) ఎక్కాడు. ఆ నగదును తన జేబులోనే పెట్టుకున్నాడు. మార్గంమధ్యలో అదే ఆటోలో మరో ఇద్దరు మహిళలు కూడా ఎక్కారు. అలా కొంత దూరం వెళ్లాక వృద్ధుడికి తాను జేబులో పెట్టుకున్న నగదు కనిపించలేదు. దాంతో పక్కన కూర్చున్న ఆ ఇద్దరు మహిళలను అడిగాడు. అంతే.. పెద్దాయన ఆ ప్రశ్న ఆడగడమే ఆలస్యం వారిద్దరూ ఆటో నుంచి దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన వృద్ధుడు (Old Man) గట్టిగా అరిచాడు. దాంతో స్థానికులు.. పారిపోతున్న ఆ ఇద్దరిలో ఓ మహిళను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని (Haryana) రెవరీ నగర పరధిలోని పదైవాస్ గ్రామానికి చెందిన రామచంద్ర తన సోదరి ఇంట్లో వివాహం ఉండడంతో ఆమెకు ఇచ్చేందుకు గాను బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నుంచి రూ.1లక్ష డ్రా చేశాడు. అనంతరం ఇంటికి వచ్చేందుకు ఆటోరిక్షా ఎక్కాడు. ఆ లక్ష రూపాయలను తన జేబులోనే పెట్టుకున్నాడు. మార్గంమధ్యలో అదే ఆటోలో మరో ఇద్దరు మహిళలు కూడా ఎక్కారు. వారిద్దరూ ఆ పెద్దాయనకు ఇరువైపులు కూర్చుకున్నారు. అలా కొంత దూరం వెళ్లాక రామచంద్రకు తాను జేబులో పెట్టుకున్న నగదు కనిపించలేదు. దాంతో పక్కన కూర్చున్న ఆ ఇద్దరు మహిళలను అడిగాడు.
Viral Video: రైల్లో ఓ వృద్ధ జంట ప్రయాణం.. భర్త చేసిన పనిని దూరం నుంచి సీక్రెట్‌గా వీడియో తీశాడో ప్రయాణీకుడు.. నెట్టింట పోస్ట్ చేస్తే..
అంతే.. ఆయన ఆ ప్రశ్న ఆడిగాడో లేదో వారిద్దరూ ఆటో దిగి పారిపోవడం చేశారు. రామచంద్ర వెంటనే గట్టిగా అరవడంతో పారిపోతున్న ఆ ఇద్దరిలో ఓ మహిళను స్థానికులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. మొదట తన వద్ద ఎలాంటి నగదు లేదని బుకాయించిన ఆమె.. పోలీసులు గట్టిగా అడగడంతో రూ.1లక్ష తీసి ఇచ్చేసింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మరో మహిళ గురించి వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.