Car Driver: వీడేం డ్రైవరండీ బాబోయ్.. ఇంత చిన్న గ్యాప్‌లో కారును రివర్స్ చేసేందుకు ప్రయత్నం.. చివరకు..!
ABN , First Publish Date - 2023-11-24T16:56:04+05:30 IST
ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుపై ఓ వ్యక్తి కారును వెనక్కు మళ్లించిన తీరు జనాలను షాక్‌కు గురి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: కొందరి ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏ నమ్మకంతో వారు ప్రమాదాలకు ఎదురెళతారో ఓపట్టాన అర్థం కాదు. అలాంటి ఓ డ్రైవర్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. రిస్క్ తీసుకుని మరీ విజయం సాధించిన అతడి తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్రైవింగ్‌లో కింగ్‌లాగా ఉన్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ డ్రైవర్ తన కారును సన్నని ఘాట్ రోడ్డుపైకి ఎక్కించాడు. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో కానీ వెంటనే కిందకు వెళ్లిపోవాలనుకున్నాడు. ఈ క్రమంలో అతడు కారును వెనక్కు తిప్పిన తీరు జనాలను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. వాస్తవానికి, ఈ సన్నని రోడ్డుపై నుంచి కిందకు దిగాలంటే కారును రివర్స్‌లో పోనియాల్సిందే. కానీ మనోడు మాత్రం ఏకంగా అక్కడ యూటర్న్ తీసుకుని కిందకు దిగిపోయాడు.
అతడు రివర్స్ తీసుకునే ప్రయత్నంలో కారు వెనక చక్రం రోడ్డు అంచును దాటిపోయింది. కారును మరికాస్త వెనక్కు పోనిచ్చి ఉంటే అది డొర్లి కిందపడిపోవాల్సిందే. కానీ, డ్రైవర్ మాత్రం అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. కారును కొద్దికొద్దిగా ముందుకూవెనక్కూ పోనిస్తూ రివర్స్ తీసుకున్నాడు. అలా పలు మార్లు ప్రయత్నించి కారు రివర్స్ చేయగలిగాడు. ఈ క్రమంలో వాహనం దాదాపుగా కింద పడే పరిస్థితి వచ్చింది. చివరకు అతడు అనుకున్నట్టుగా కారును కిందకు పోనిచ్చాడు(Dangerous uturn of car on ghat road).
ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న వీడియో చూసిన వారి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. ఇంతటి ప్రమాదకరమైన రోడ్డుమీదకు వెళ్లడం ఎందుకు? మళ్లీ రిస్క్ చేస్తూ వెనక్కు మళ్లడం ఎందుకు? అని అనేక మంది ప్రశ్నించారు. కానీ అధికశాతం మంది మాత్రం మనోడి డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయారు. కారుతోలడంలో కింగ్‌లా ఉన్నాడంటూ కామెంట్ చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడని మరికొందరు కామెంట్ చేశాడు. వీడియోలో చూపించినట్టు ఎవరూ తమ కారుతో సాహసాలకు దిగొద్దంటూ మరికొందరు తోటి నెటిజన్లను హెచ్చరించారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.