Viral News: పురిటి నొప్పులు వస్తున్నాయని భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తే.. బిడ్డను భర్త చేతిలో పెట్టినట్టే పెట్టి భారీ షాకిచ్చారు..!
ABN , First Publish Date - 2023-05-25T14:28:59+05:30 IST
అప్పుడే పుట్టిన తన బిడ్డను చూసుకుని మురిసిపోతున్న ఆ తండ్రికి వైద్యులు ఊహించని షాకిచ్చారు. వైద్యులు చెప్పింది వినగానే అతను నేరుగా..
ఓ వ్యక్తి తన భార్యకు ప్రసవం నొప్పులు రావడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు.వైద్యులు ఆ మహిళ పరిస్థితి బట్టి ఆమెకు సి-సెక్షన్ చేశారు. దేవుడి దయ వల్ల పండంటి బిడ్డ జన్మించింది. వైద్యులు బిడ్డను తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టారు. తన బిడ్డను చూసుకుని మురిసిపోతూ భార్య గురించి వైద్యులను అడిగిన ఆ వ్యక్తికి చాలా పెద్ద షాకింగ్ విషయం తెలిసింది. వైద్యులు చేసిన పనికి అతను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఒడిషా(Odisha) రాష్ట్రం కియోంజర్ జిల్లాలో సుశాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని భార్య పబిత్ర గర్భవతి. ఆమెకు నెలలు నిండి ప్రసవం నొప్పులు(Delivery pains) రావడంతో అతను భార్యను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆమె పరిస్థితి కాస్త కష్టంగానే ఉండటంతో ఆమెకు సి-సెక్షన్(c-section) చెయ్యాలని వైద్యులు చెప్పారు. ఇందుకోసం సుశాంత్ నుండి ఆపరేషన్ అనుమతి కోసం సంతకాలు కూడా తీసుకున్నారు. ఆపరేషన్ లో వారికి పండంటి బిడ్డ జన్మించింది. అక్కడి నర్స్ లు బిడ్డను తీసుకెళ్ళి సుశాంత్ చేతిలో పెట్టారు. బిడ్డను చూసుకుని మురిసిపోతున్న సుశాంత్ 'నా భార్య ఎలా ఉంది?' అని నర్స్ ను అడిగాడు. 'ఆమెకు సి-సెక్షన్ తో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్(tubectomy) కూడా చేశారు కదా.. కోలుకోవడానికి సమయం పడుతుంది' అని చెప్పింది సదరు నర్స్. తన భార్యకు కుటుంబ నియంత్రణ చేయడం ఏంటో అతనికి అర్థం కాలేదు. అతను వెంటనే వైద్యుల(doctors) దగ్గరకు వెళ్ళి నిలదీశాడు. 'అవును ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాము' అని వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఎవరి అనుమతితో మీరు ఆపరేషన్ చేశారని సుశాంత్ వైద్యులమీద మండిపడ్డాడు. అతను వెంటనే కియోంజర్ పోలిస్ స్టేషన్(police station) కు వెళ్ళి వైద్యులు చేసిన పని గురించి ఫిర్యాదు చేశాడు.
Viral Video: థియేటర్‌కు వెళ్లిన భార్యాభర్తలు.. సినిమా పూర్తయ్యాక ఏం చేస్తున్నారో చాటుగా వీడియో తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!
సుశాంత్ భార్య పబిత్రా వైద్యుల గురించి చెబుతూ 'డాక్టర్లు సిజేరియన్ చేయడానికి తీసుకెళ్లే ముందు నాతో సంతోకం చేయించుకున్నారు. నేను ప్రసవించిన తరువాత నా భర్త దగ్గర సంతకం తీసుకున్నారు. కారణం ఏంటని అడిగితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని చెప్పారు. నా భర్త అనుమతి లేకుండా ఎలా చేస్తారని అడిగాను. కానీ వారు బెదిరించారు. నన్ను, బిడ్డను డిశ్చార్చి చేయకుండా ఆసుపత్రిలోనే ఉంచి ఇబ్బందులు పెడతామని బ్లాక్మెయిల్ చేశారు' అని ఆమె జరిగింది మొత్తం చెప్పింది. కాగా ఈ విషయం గురించి వైద్యులను విచారించగా భార్యాభర్తల అనుమతితోనే మేము సి-సెక్షన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ రెండూ చేశామని, మొదట సరేనని ఆ తరువాత అతను దుర్భాషలాడుతున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు. భార్యాభర్తల సంతకాలు లేనిదే ఎక్కడా ఆపరేషన్ చేయరని ఆ భార్యాభర్తలు చెబుతున్నవి అబద్దాలని వారి మాటలు ఖండించారు.