Viral: కూతురు చెప్పిందని ఆ జర్మనీ ఫుడ్ రుచి చూసిన మహిళ.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2023-01-31T22:03:57+05:30 IST

తల్లికి జర్మనీ అల్పాహారాన్ని రుచి చూపించిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాగదు..

Viral: కూతురు చెప్పిందని ఆ జర్మనీ ఫుడ్ రుచి చూసిన మహిళ.. ఆ తరువాత..

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల కోసం సర్వం త్యాగం చేస్తారు తలిదండ్రులు. వాళ్లే ప్రపంచంగా బతుకుతారు. సంతానం ఆనందం కోసం ఏమైనా చేసేందుకు వెనకాడరు. పిల్లలు ప్రయోజకులైతే వారి ఆనందానికి అంతే ఉండదు. మరి తమ కోసం ఇంత చేసిన తల్లిదండ్రులను చూస్తే పిల్లల్లోనూ ప్రేమాభినాలు ఆకాశాన్నంటుతాయి. అందుకే.. అనేక మంది తమ తొలి జీతంతో తల్లిదండ్రులకు ఏదో ఒక బహుమతి ఇస్తుంటారు. చిన్నప్పుడు అమ్మానాన్నలు తమను షికారుకు తీసుకెళ్లినట్టు పిల్లలు కూడా పెద్దయ్యాక తల్లిదండ్రులను టూర్‌పై తీసుకెళ్లాలని కోరుకుంటారు. విదేశాల్లో ఉంటున్న ఓ యువతి కూడా అచ్చు ఇలాగే చేసింది. జర్మనీలో ఉంటున్న ఆమె తన తల్లిని అక్కడకు తీసుకొచ్చింది. తన తల్లి జర్మనీ అనుభవాన్ని నెట్టింట్లో పంచుకుందా యువతి.

విదేశ్ ఇండియన్(Videsh Indian) పేరిట ఉన్న అకౌంట్లో ఆ యువతి తన వీడియోను షేర్ చేశారు. జర్మనీలో అల్పాహారమైన ప్రెట్జెల్‌ను(Pretzel) తల్లికి తొలిసారిగా రుచి చూపించింది. అప్పటివరకూ భారతీయ వంటకాల్ని.. మహా అయితే.. ఒకటో రెండో విదేశీ వంటకాల్ని రుచి చూసిన ఆమెకు ప్రెట్జెల్ తినగానే మొహం అదోలా పెట్టేసింది. పర్లేదు బానే ఉంది అంటూనే ఇబ్బందిగా ఫీలవుతుంది. ఇదంతా వీడియోలో రికార్డు చేసిన కూతురు.. మా అమ్మ దాదాపుగా జర్మనీ మహిళ అయిపోయిందంటూ ఓ సరదా కామెంట్‌తో నెట్టింట షేర్ చేస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్(Viral Video) అయింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ‘‘ఆంటీకి ప్రెట్జెల్ అస్సలు నచ్చలేదు. మాకర్థమైంది’’ అని కొందరు కామెంట్ చేశారు. ‘‘భారతీయ వంటకాలైనా విదేశీ వంటకాలైనా ఆహారం టేస్టీగా ఉండాల్సిందే..’’అంటూ మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు.

Updated Date - 2023-01-31T22:03:58+05:30 IST