ODI World Cup: టీమిండియాకు ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం
ABN , First Publish Date - 2023-10-20T15:36:29+05:30 IST
గాయం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం నాడు ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా బీసీసీఐ వెల్లడించింది.
వన్డే ప్రపంచకప్‌లో నాలుగు వరుస విజయాలతో సెమీస్ రేసులో దూసుకెళ్తున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం నాడు ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా బీసీసీఐ వెల్లడించింది. పాండ్యా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ సంరక్షణలో ఉన్నాడని.. అతడికి కొంత విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని బీసీసీఐ తెలిపింది. అందుకే అతడు న్యూజిలాండ్ మ్యాచ్ కోసం శుక్రవారం నాడు టీమిండియా ధర్మశాలకు వెళ్లే విమానం ఎక్కడం లేదని.. అతడు నేరుగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడనున్న లక్నోకు వెళ్లి టీమిండియాతో కలుస్తాడని వివరించింది.
ఇది కూడా చదవండి: ODI World Cup: ప్రపంచకప్‌లో డీఆర్ఎస్‌పై వివాదం.. అసంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా
కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. కాలి మడమ గాయం కారణంగా మైదానం వీడి వెళ్లిపోయాడు. ముందు జాగ్రత్త చర్యగా పాండ్యాను బీసీసీఐ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ నిర్వహించింది. స్కానింగ్‌లో పాండ్య కాలికి పెద్ద గాయమేమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్య దూరం కానున్నాడు. పాండ్య స్థానంలో షమీ లేదా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ధర్మశాలలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి పాండ్య స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.