Shubman Gill: అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గా గిల్

ABN , First Publish Date - 2023-01-24T16:37:03+05:30 IST

టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) అరుదైన రికార్డును తన పేర వేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌(New Zealand)తో

Shubman Gill: అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన క్రికెటర్‌గా గిల్

ఇండోర్: టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill) అరుదైన రికార్డును తన పేర వేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌(New Zealand)తో ఇండోర్‌లోని `హోల్కార్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో సెంచరీ సాధించిన గిల్.. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. కేవలం 21 ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఆ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 72 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కంటే ముందు శిఖర్ ధవన్(Shikhar Dhawan) ఉన్నాడు. ధవన్ 24 ఇన్నింగ్స్‌లలో నాలుగు శతకాలు బాదితే గిల్ మూడు ఇన్నింగ్స్‌ల ముందే నాలుగు సెంచరీలు నమోదు చేశాడు.

అలాగే, గిల్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును గిల్ సమం చేశాడు. ఈ సిరీస్‌లో గిల్ 360 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సరసన నిలిచాడు. 2016లో విండీస్‌తో జరిగిన సిరీస్‌లో బాబర్ 360 పరుగులు సాధించాడు. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ (208) పరుగులు చేసిన గిల్ రెండో వన్డేలో 40 పరుగులు (నాటౌట్) చేశాడు. తాజాగా జరుగుతున్న వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు.

Updated Date - 2023-01-24T16:37:04+05:30 IST