Canada Open 2023: కెనడా ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. నిరాశపరిచిన పీవీ సింధు

ABN , First Publish Date - 2023-07-09T09:37:24+05:30 IST

భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ (Lakshya Sen) కెనడా ఓపెన్ ఫైనల్‌కు (Canada Open 2023) దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 ఈవెంట్‌ (BWF Super 500 event) సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను వరుస సెట్‌లలో చిత్తుగా ఓడించిన లక్ష్యసేన్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

Canada Open 2023: కెనడా ఓపెన్ ఫైనల్లో లక్ష్యసేన్.. నిరాశపరిచిన పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ (Lakshya Sen) కెనడా ఓపెన్ ఫైనల్‌కు (Canada Open 2023) దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 ఈవెంట్‌ (BWF Super 500 event) సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను వరుస సెట్‌లలో చిత్తుగా ఓడించిన లక్ష్యసేన్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఏకపక్షంగా సాగిన ఈ సెమీ ఫైనల్ పోరులో లక్ష్యసేన్ 21-17, 21-14 తేడాతో గెలిచాడు. 44 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో నిషిమోటోను ఓడించిన లక్ష్యసేన్ తమ హెడ్ టూ హెడ్ రికార్డును 2-1కి మెరుగుపరచుకున్నాడు. కాగా ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్.. తనకన్నా మెరుగైన ర్యాంకర్ 11వ స్థానంలో ఉన్న నిషిమోటోను ఓడించడం గమనార్హం. ఇక ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ పోరులో కొడై నారోకా లేదా లిషి ఫెంగ్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు. కాగా లక్ష్యసేన్ ఓ టోర్నీలో ఫైనల్ చేరడం ఏడాది తర్వాత ఇదే మొదటిసారి. చివరగా గత ఆగష్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరాడు.


మరోవైపు మహిళల విభాగంలో తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారిణి పీవీ సింధు ( P.V. Sindhu) నిరాశపరిచింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ అకానె యమగూచితో జరిగిన సెమీ ఫైనల్ పోరులో సింధు ఓటమి పాలైంది. ప్రస్తుతం 15వ ర్యాంకులో ఉన్న సింధు.. యమగూచి చేతిలో 14-21, 15-21తో వరుస సెట్లలో ఓడిపోయింది. కాగా యమగూచి చేతిలో సింధుకు ఇది వరుసగా రెండో ఓటమి. సింగపూర్ ఓపెన్‌లోనూ యమగూచి చేతిలోనే ఓడి రౌండ్ దశలోనే ఇంటి దారి పట్టింది. కాగా సింధు చివరగా గత ఆగష్టులో జరిగిన కామన్వెల్గ్ గేమ్స్‌‌లో గెలిచింది. ఆ తర్వాత గాయాలతో బాధపడుతూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది.

Updated Date - 2023-07-09T09:39:34+05:30 IST