Gujarat vs Lucknow: గుజరాత్‌పై మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో.. కెప్టెన్ కృనాల్ పాండ్యా ఏం ఎంచుకున్నాడంటే...
ABN , First Publish Date - 2023-05-07T15:10:59+05:30 IST
7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఒక పక్క.. 5 గెలుపులతో 4వ స్థానంలో ఉన్న టీమ్ మరోపక్క ఐపీఎల్ 2023లో (IPL2023) మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు తెరలేచింది.
అహ్మదాబాద్: 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఒక పక్క.. 5 గెలుపులతో 4వ స్థానంలో ఉన్న టీమ్ మరోపక్క ఐపీఎల్ 2023లో (IPL2023) మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు తెరలేచింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Gujarat Titans vs Lucknow Super Giants) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా ఐర్లాండ్ ఆటగాడు జోషువా లిటిల్ తన దేశానికి ఆడేందుకు వెళ్లడంతో అతడి స్థానంలో అల్జారీని జట్టులోకి తీసుకున్నట్టు కృనాల్ పాండ్యా చెప్పాడు.
కాగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వడంతో కృనాల్ పాండ్యాకు జట్టు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో అన్నదమ్ముళ్లయిన హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్: క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), కయిల్ మేయర్స్, దీపక్ హుడా, కరన్ శర్మ, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, యస్ థాకూర్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మొహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ.