IPL 2023: బెంగళూరుపై లఖ్‌నవూ విజయం
ABN , First Publish Date - 2023-04-10T23:27:09+05:30 IST
ఐపీఎల్2023లో బెంగళూరు(Bengaluru)పై లఖ్‌నవూ( Lucknow ) విజయం సాధించింది.
బెంగళూరు: ఐపీఎల్2023లో బెంగళూరు(Bengaluru)పై లఖ్‌నవూ( Lucknow ) విజయం సాధించింది. RCBపై 3 వికెట్ల తేడాతో లఖ్‌నవూ జెయింట్స్ దుమ్ము దులిపింది. బెంగళూరు 212/2, లక్నో 213/6 చేసింది. కాగా మెదటగా డూ ప్లెసిస్ 79, విరాట్ కోహ్లీ 61 పరుగులు చేశాడు. ఆ తర్వాత లఖ్‌నవూ బ్యాటింగ్ పూరన్ 80 నాటౌట్, మార్కస్ స్టోనిస్ 65 పరుగులు చేశాడు. తొలుత విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆ తర్వాత డుప్లెసిస్(Duplessis), చివర్లో మ్యాక్స్‌వెల్(Maxwell) చెలరేగిపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో జరుగుతున్న ఐపీఎల్ 15వ మ్యాచ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. 44 బంతులు ఆడిన కోహ్లీ 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ కూడా బ్యాట్‌తో వీరంగమేశాడు. యథేచ్ఛగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 29 బంతులు ఆడిన మ్యాక్స్‌వెల్ 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 59 పరుగులు చేసి చివరి ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు.మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ ఫా డుప్లెసిస్ కూడా బౌలర్లను ఆడేసుకున్నాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి ముగ్గురు అర్ధ సెంచరీలతో విరుచుకుపడడంతో పరుగులు పెట్టిన స్కోరు 212 పరుగుల వద్ద ఆగింది. బెంగళూరు ఆటగాళ్లు పరుగులు పెట్టించిన చివరికి లక్నోను విజయం వరించింది.