AustraliaCricket: మూడో టెస్ట్ కి ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ దూరం, ఏమైందంటే...
ABN , First Publish Date - 2023-02-24T17:41:22+05:30 IST
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుండి జరగబోయే మూడో టెస్టు కి ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఆడటం లేదు. వైస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా టీం ని లీడ్ చేస్తున్నాడు. ఇంతకీ ఏమైంది అంటే...
ఇండియా, ఆస్ట్రేలియా (#IndiavsAustraliaCricket) జట్ల మధ్య మార్చి 1 నుండి ప్రారంభం కానున్న మూడో టెస్టు (#ThirdCricketTest) మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుకి ఇంకో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (#PatCummunis) మూడో టెస్ట్ ఆడటం లేదని (ThirdTest) చెప్పాడు. అతను రెండో క్రికెట్ టెస్టు అయిపోయిన వెంటనే స్వంత దేశం ఆస్ట్రేలియాకి (#Australia) పయనం అయ్యాడు. విషయం ఏమిటి అంటే, అతని తల్లికి చాలా సీరియస్ గా ఉండటం తో పాట్ కమ్మిన్స్ కుటుంబంతో పాటు తల్లి దగ్గర ఉండాలని అనుకున్నాడు. అయితే ముందుగా రిటర్న్ టికెట్ కూడా బుక్ చెయ్యటం జరిగింది, ఎందుకంటే అతను మూడో టెస్ట్ మొదలయ్యేసరికి వచ్చేద్దాం అనుకున్నాడు.
కానీ ఇప్పుడు అతను మనసు మార్చుకున్నాడు. తన తల్లితోటే ఉండాలని నిర్ణయించుకున్నాడని చెపుతున్నాడు. తన తల్లి ఇప్పుడు మంచం మీద వున్నారు, ఒకరకమయిన వ్యాధితో బాధపడుతోంది, అందుకని తాను మిగతా కుటుంబ సభ్యులకి ధైర్యంగా వుండి, తల్లి దగ్గరే ఉండాలని నిశ్చయించుకున్నాను అని చెపుతున్నాడు.
ఆదివారం వచ్చి మిగతా ఆస్ట్రేలియా జట్టు సభ్యులతో కూడా ప్రాక్టీస్ చెయ్యాలి, కానీ ఇప్పుడు అతను తిరిగి రాకపోవటం తో వైస్ కెప్టెన్ అయిన స్టీవెన్ స్మిత్ (#StevenSmith) కెప్టెన్ గా ఆస్ట్రేలియా టీం ని నడిపిస్తాడు. (#StevenSmith to lead Asutralia team) ఇప్పటికే రెండు టెస్టులలో ఓడిపోయిన, ఆస్ట్రేలియా కి కెప్టెన్ కమ్మిన్స్ లేకపోవటం జట్టు మరింత బలహీన పడటమే అవుతుంది. ఇప్పటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner), బౌలర్ జోష్ హాజిల్ వుడ్ (Josh Hazlewood), అల్ రౌండర్ అగర్ (Ashton Agar) ఆస్ట్రేలియా తిరుగు ముఖం పట్టారు. కమ్మిన్స్ ప్లేస్ లో ఇంకో ఫాస్ట్ బౌలర్ స్టాక్ (Mitchell Starc) రావొచ్చు అని అంటున్నారు. లేదా మూడో టెస్ట్ లో ఆడని బొలాండ్ (Scott Boland) కూడా వున్నాడు.
టెస్ట్ సిరీస్ తరువాత వన్ మ్యాచెస్ మొదలవుతాయి. ముందుగా ప్రకటించిన విధంగా ఆ వన్ డే సిరీస్ కి కూడా ఆస్ట్రేలియా జట్టుకి కమ్మిన్స్ నాయకత్వం వహించాలి, కానీ ఇప్పుడు ఒక్క టెస్ట్ మ్యాచెస్ వరకేనా, లేక వన్ డే మ్యాచెస్ కి వస్తాడా రాడా అన్న విషయం ఇంకా తేలాలి.