Share News

డేరింగ్‌ క్రికెట్‌ ఆడా..!

ABN , First Publish Date - 2023-11-25T01:35:55+05:30 IST

కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు రికార్డు విజయాన్ని అందించడం ఎంతో గర్వంగా ఉందని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. తొలి టీ20లో ఆసీస్‌ 208 పరుగులు చేసినా..

డేరింగ్‌ క్రికెట్‌ ఆడా..!

విశాఖపట్నం:కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు రికార్డు విజయాన్ని అందించడం ఎంతో గర్వంగా ఉందని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. తొలి టీ20లో ఆసీస్‌ 208 పరుగులు చేసినా.. సూర్య ధనాధన్‌ అర్ధ శతకంతో మరో బంతి మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. ఈ మ్యాచ్‌లో తాను ‘ఫియర్‌ లెస్‌’ క్రికెట్‌ ఆడానని అతడు చెప్పాడు. ‘ఇషాన్‌ నాకెంతో సహకరించాడు. నేను దూకుడుగా ఆడితే.. అతడు వికెట్‌ను అంటిపెట్టుకొనే ప్రయత్నం చేశాడు. కెప్టెన్సీ భారాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే వదిలేసి మైదానంలో బ్యాటింగ్‌ను ఆస్వాదించా. ఒకానొక దశలో ఆసీస్‌ స్కోరు 230 దాటేలా కనిపించినా.. మన బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశార’ని కొనియాడాడు. ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎటువంటి ఆందోళనా కనిపించలేదన్నాడు. కుర్రాళ్లు తెగువను ప్రదర్శించారని చెప్పాడు.

Updated Date - 2023-11-25T01:39:12+05:30 IST